జంధ్యాల గారి తరువాత కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు దివంగత దర్శకులు ఇవివి సత్యనారాయణ గారు. ‘చెవిలో పువ్వు’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన మొదటి చిత్రంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. ఈయనకు మొదటి హిట్ ఇచ్చిన చిత్రం ‘ప్రేమ ఖైదీ’. కామెడీతో సమానంగా సెంటిమెంట్ ను కూడా అద్భుతంగా జోడించడంలో ఇవివి గారు దిట్ట.అప్పట్లో ప్రతీ హీరోలోనూ కామెడీ యాంగిల్ ను బయటకు తీసింది మన ఇవివి గారే..!
ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో టైటిల్ కార్డ్స్ ను కొత్తగా వెయ్యడంలో సుకుమార్ మంచి పేరు సంపాదించుకున్నారు. ‘ఆర్య2’ ‘100% లవ్’ ”1 నేనొక్కడినే’ వంటి చిత్రాలతో పాటు ఆయన నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ చిత్రంలో టైటిల్ కార్డ్స్ చాలా అద్భుతంగా కొత్తగా వేశారు అనే ప్రశంసలు అందుకున్నాడు సుకుమార్. అయితే ఆయనకు మించిన క్రియేటివిటీ ఇవివి గారిలో కూడా ఉందని ఆరోజుల్లోనే ప్రూవ్ చేసుకున్నారు. 1992 ఇవివి గారు డైరెక్ట్ చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’,
‘జంబలకిడిపంబ’, అలాగే 1994 లో డైరెక్ట్ చేసిన ‘హలో బ్రదర్’ వంటి చిత్రాల్లో టైటిల్ కార్డ్స్ చూస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. నిజానికి చాలా నవ్వు తెప్పిస్తుందనే చెప్పాలి. అంతేనా అనుకోకండి. ఆయన 1999 లో శ్రీకాంత్ తో తెరకెక్కించిన ‘పిల్ల నచ్చింది’ అనే చిత్రానికి అంతకు మించిన క్రీటివిటీని ఉపయోగించి టైటిల్ కార్డ్స్ వేశారు. కావాలంటే ఈ వీడియో చూడండి. మీరే ఒప్పుకుంటారు.
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!