ఆకట్టుకుంటున్న ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ఫస్ట్ సింగల్..!

‘బాహుబలి2’ చిత్రంలో సేతుపతిగా పాపులర్ అయ్యాడు రాకేష్ వర్రె. ‘జోష్’ ‘గూఢచారి’ ‘మిర్చి’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ‘బాహుబలి2’ చిత్రమే అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే ఇప్పుడు హీరోగా కూడా మారబోతున్నాడు రాకేష్. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. బసవ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై స్వయంగా రాకేషే నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 8 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం విశేషం.

ఇక ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పాటని విడుదల చేశారు. ‘అవునా నిజమేనా’ అంటూ సాగే ఈ పాటకి శంకర్ శర్మ సంగీతమందించాడు. వాసు వలబోజు లిరిక్స్ అందించాడు. మెలోడీస్ ఇష్టపడే వారికి ఈ పాట కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus