Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ తీరుపై ఎగ్జిబిటర్లు ఫైర్!

మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఫహద్ ఫాజిల్. అక్కడ ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారాయన. ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇప్పుడు ఆయన తన కెరీర్ పరంగా ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఫహద్ ఫాజిల్ సోలోగా నటించిన చివరి సినిమా ‘ట్రాన్స్’. 2020లో ఆ సినిమా విడుదలైంది. కేరళలో ఇదొక బ్లాక్ బస్టర్. ఆ తరువాత ఫహద్ నటించిన నాలుగు సినిమాలు వరుసగా ఓటీటీలో విడుదలయ్యాయి.

‘సీయూ సూన్’, ‘ఇరుల్’, ‘జోజి’, ‘మాలిక్’ ఇవన్నీ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలన్నీ బాగానే ఆడాయి. కొన్ని భాషలకు రీమేక్ హక్కులను కూడా అమ్మేశారు. నేరుగా డిజిటల్ రిలీజ్ కు ఇవ్వడంతో దాదాపు వంద కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ పోగొట్టాడని ఫహద్ ఫాజిల్ మీద అక్కడ డిస్ట్రిబ్యూటర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నటించిన మరో సినిమా మలయన్ కుంజుని కూడా ఓటీటీకి ఇచ్చేశారు. ఆయన బిగ్ స్క్రీన్ పై కనిపించింది ‘పుష్ప’, ‘విక్రమ్’లో మాత్రమే.

వాటిలో అల్లు అర్జున్, కమల్ హాసన్ హీరోలుగా నటించారు. ఫహద్ నటించిన సినిమాలన్నీ ఓటీటీలకు ఇస్తుండడంతో అతడి మీద ఎగ్జిబిటర్స్ లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇకపై అతడి సినిమాలు కొనమని నిర్ణయం తీసుకోవాలన్నా.. వేరే హీరోల కాంబినేషన్ లో నటిస్తుండడంతో భరిస్తున్నారు ఎగ్జిబిటర్లు, బయ్యర్లు. తనపై నెగెటివిటీ పెరుగుతున్నా..

ఫహద్ ఫాజిల్ మాత్రం దేన్నీ పట్టించుకోవడం లేదు. తన నెక్స్ట్ సినిమా ‘పుష్ప2’ కోసం రెడీ అవుతున్నారు. సెకండ్ పార్ట్ లో అతడి పాత్ర కీలకంగా ఉండబోతుంది. దీనికోసం చాలా రోజుల పాటు కాల్షీట్స్ కేటాయించబోతున్నారు ఫహద్ ఫాజిల్.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus