Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » “అథర్వ” చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లిరికల్ ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే’

“అథర్వ” చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లిరికల్ ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే’

  • May 15, 2023 / 09:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“అథర్వ”  చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లిరికల్  ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే’

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చే సినిమాల్లో రొమాంటిక్, లవ్ ట్రాక్ సాంగ్స్ ఎక్కువగా ఉండవు. కానీ ‘అథర్వ’ అనే చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్, సాంగ్స్ ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్యాచీ పాటను మేకర్లు విడుదల చేశారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీచరణ్‌ పాకాల బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, జావెద్ అలీ గాత్రం అన్నీ చక్కగా కుదిరాయి. ఇక డ్యాన్స్ మాస్టర్ రాజ్ కృష్ణ కొరియోగ్రఫీ కూడా చూడచక్కగా ఉంది.

పాటను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. ‘మేం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్‌లోనే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని తెలియజేశాం. హీరో చిన్నతనం నుండి హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేక పోతాడు. ఆలా తన ఫీలింగ్‌ను సినిమాలో ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ పాట ఆ సన్నివేశానికి సరిగ్గా సరిపోతుందని ఎంచుకున్నాం. శ్రీ చరణ్ ఈ పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తనకు జన్మదిన శుభాకాంక్షలు. మేం అడిగిన వెంటనే లిరిక్ రైటర్ మంచి పాట రాశాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంద’ని అన్నారు.

చిత్ర నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. ‘అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంతకుముందు మేం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు టీం అంతా చాలా కష్టపడ్డాం. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన’ని అన్నారు.

హీరో కార్తీక్ మాట్లాడుతూ.. ‘కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా నన్ను వెలుగులోకి తీసుకువచ్చిన భీమనేని శ్రీనివాస్ రావు గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రోజు మేము విడుదల చేసిన సాంగ్ ప్రేక్షకులకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు సినిమాను చాలా బాగా తీశాడు. నిర్మాత సుభాష్ కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చడమే కాకుండా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారు’ అని అన్నారు.

హీరోయిన్ సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా ఇందులో చాలా ఏమోషన్స్ ఉన్నాయి. నేను డ్యాన్సర్ అయినా నాకు ఇందులో ఒక్క స్టెప్ వేసే అవకాశం కూడా రాలేదు. టీం అంతా కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇలాంటి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నా కో స్టార్ కార్తీక్ చాలా హానెస్ట్ పర్సన్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు విడుదల చేసిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంద’ని అన్నారు.

నటుడు గగన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి రింగా రింగా అనే పాట తెలియని వారుండరు. ఇప్పుడు అలాంటి పదంతో మేము విడుదల చేసిన రింగ రింగా రోసే సాంగ్ కూడా కచ్చితంగా ట్రెండ్ అవుతుంది. మంచి కథతో వస్తున్న ఈ సినిమా ద్వారా మాకు, దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు కిరణ్ మచ్చ మాట్లాడుతూ.. ‘యూట్యూబ్ నుంచి వచ్చిన నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీ చరణ్ అన్న చేసిన రింగ రింగ సాంగ్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంద’ని అన్నారు.

కొరియోగ్రాఫర్ బాను మాస్టర్ మాట్లాడుతూ.. ‘మహేష్ అన్న నాకు సాయి ధర్మతేజ్ తిక్క సినిమా నుండి పరిచయం. తను ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి చాలా బాగా నటించారు. ఈ సినిమా నుండి విడుదల చేసిన రింగ రింగ సాంగ్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో వస్తున్న మా సినిమాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు విజయ్ రామారాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి మా తో పాటు దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాల’ని అన్నారు.

రమణ మాట్లాడుతూ.. ‘అందరికీ గుర్తుండిపోయే సినిమాగా ఈ “ఆథర్వ” నిలుస్తుంద’ని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atharva
  • #Karthik Raju

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

13 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

14 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version