ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.134 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఎఫ్3’

  • July 5, 2022 / 01:36 PM IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి  ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘ఎఫ్ 3’.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఏరియాల్లో ఇప్పటికీ 10 థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి  సినిమాలు చూడడం తగ్గించిన ఈ రోజుల్లో ‘ఎఫ్ 3’ మూవీని లాంగ్ రన్లో కూడా కుటుంబ ప్రేక్షకులు ఆదరించడం అంటే నిజంగా గొప్ప విజయం గా భావించాలి.

‘ఎఫ్ 3’ సక్సెస్ ఫుల్ గా 40 రోజులు పూర్తి చేసుకుని 50 రోజుల రన్ దిశగా పరుగులు తీస్తుంది.డబుల్ బ్లాక్ బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘ఎఫ్3 ‘ చిత్రం మే 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.’శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏడు వారాల రన్ పూర్తయ్యే వరకు ఈ చిత్రాన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయకూడదని వారు ముందుగానే గట్టిగా చెప్పారు.

సినిమా సక్సెస్ ఫుల్ గా లాంగ్ రన్ ను కొనసాగించడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. నైజాంలో ‘ఎఫ్3’ అరుదైన రూ.20 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించింది. ‘ఎఫ్3’ ఫుల్ రన్లో ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో  రూ.53.94 Cr షేర్ ను మరియు ప్రపంచవ్యాప్తంగా రూ.70.94 Cr షేర్ ని వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.134 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ‘ఎఫ్3’.

‘ఎఫ్3’ ఏరియాల వారీగా కలెక్షన్ల జాబితాని గమనిస్తే :
నైజాం – 20.57cr
ఉత్తరాంధ్ర- 7.48cr
ఈస్ట్ – 4.18cr
వెస్ట్ – 3.41cr
కృష్ణా – 3.23cr
గుంటూరు – 4.18cr
నెల్లూరు – 2.31cr
సీడెడ్ – 8.58cr
కర్ణాటక – 5Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా- 2Cr
ఓవర్సీస్ – 10Cr

ఏపీ/తెలంగాణ – 53.94Cr(Incl. GST)
వరల్డ్ వైడ్ షేర్ – 70.94Cr
వరల్డ్ వైడ్ గ్రాస్ – 134Cr

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus