వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 మూవీ ఈ ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. రిలీజ్ కు ముందే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఎఫ్3 మూవీ విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన సోనీ లివ్ ఎఫ్3 సినిమా హక్కులను దక్కించుకుంది.
అయితే ఎఫ్3 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి చిత్రయూనిట్ నుంచి ప్రకటన వెలువడింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా హిట్ అనిపించుకుంటుందేమో చూడాల్సి ఉంది. వాస్తవానికి తెలుగులో అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా, జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలకు ఎక్కువ ఆదరణ ఉంది. సోనీ లివ్ ఇప్పటికే పలు సినిమాల హక్కులను కొనుగోలు చేసినా ఈ ఓటీటీకి సబ్ స్క్రైబర్ల సంఖ్య తక్కువగానే ఉంది.
ఎఫ్3 మూవీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ కావచ్చని సోనీ లివ్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఎఫ్3 మూవీ ఈ ఓటీటీ నిర్వాహకులకు ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు హీరో వెంకటేష్ అటు స్ట్రెయిట్ సినిమాలతో ఇటు రీమేక్ సినిమాలతో వరుస విజయాలను అందుకుంటున్నారు. నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదలై సంచలన విజయాలను సొంతం చేసుకోగా ఎఫ్3 సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకుంది.
ఎఫ్3 సినిమాకు వెంకటేష్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ వల్లే ఈ సినిమా సక్సెస్ సాధించిందని చాలామంది అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎఫ్4 మూవీ కూడా తెరకెక్కనుందని తెలుస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!