F3 Trailer: సూపరు.. ఎక్స్ట్రార్డినరీ.. అదిరిపోయిందిగా..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్3’. ‘సమ్మర్ సోగ్గాళ్లు’ అనేది క్యాప్షన్. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ ఇది. ఇప్పటివరకు విడుదలైన పాటలు, ప్రోమోలు అందరినీ అలరించాయి. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.2 నిమిషాల 32 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

‘ఎఫ్2’ అనేది పెళ్లి, పెళ్ళాల చుట్టూ తిరిగే కథ అయితే ‘ఎఫ్3’ అనేది డబ్బు చుట్టూ తిరిగే కథ. ‘ఎఫ్2’ లోని పాత్రలే ఈ మూవీలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. ‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు 5.. కానీ 6వ భూతం ఒకటి ఉంది. అదే డబ్బు. అది ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్ట్రేషన్’.. అంటూ మురళీశర్మ వాయిస్ ఓవర్లో వచ్చే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

‘వాళ్ళది పెద్ద మాయలమరాఠీ ఫ్యామిలీ.. వాళ్ళది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ’.. ‘వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ.. వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ’ … అనే డైలాగులు బాగున్నాయి.

తమన్నా గ్లామర్.. మెహ్రీన్ ల కామెడీ.. కూడా ఇందులో ఎక్కువగానే ఉండేలా ఉన్నాయి. ఇక రే చీకటితో బాధపడే వ్యక్తిగా వెంకటేష్… నత్తితో బాధపడే వ్యక్తి గా వరుణ్ తేజ్ ల నటన అలరించే విధంగా ఉంటుందని స్పష్టమవుతుంది.అంతేకాదు ప్రగతి, రఘుబాబు,సునీల్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి ట్రాక్ లు కూడా బాగుంటాయి అనే ఆశలు కల్పిస్తుంది ట్రైలర్.ఓవరాల్ గా.. ఈ సమ్మర్ కు దర్శకుడు అనిల్ రావిపూడి మంచి ఫన్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పాలి. మే 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus