ఏంటిది… కాస్త మారండి బాబూ అంటున్న నెటిజన్లు

అదో పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌. స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంటుంది. ఫలానా సమయానికి అప్‌డేట్‌ ఇస్తాం అంటూ ఓ ట్వీట్‌ పెడతారు… ఇంకేముంది అభిమానులు ‘వావ్‌ వెయిటింగ్‌ ’ అంటూ కింద మెసేజ్‌లు, రీట్వీట్‌లు పెట్టేస్తారు. తీరా ఆ సమయానికి వచ్చి చూస్తే అక్కడ అప్‌డేట్‌ ఉండకపోగా… ‘కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది’ అంటూ ఓ చిన్న మెసేజ్‌ పెట్టి వెళ్లిపోతారు. ఇది అప్‌డేట్‌ విషయంలోనే కాదు టీజర్‌, ట్రైలర్‌, పాట.. ఇలా చాలా విషయాల్లోనూ ఇంతే. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ నిర్మాణ సంస్థ ఏదో అని.

నిజానికి టాలీవుడ్‌లో చాలా నిర్మాణ సంస్థలు పై విధానంలో వాయిదాలు వేస్తుంటాయి. అయితే ఎక్కువగా ‘వాయిదా’ జపం చేసే నిర్మాణ సంస్థ అయితే మాత్రం ‘హారిక హాసిని క్రియేషన్స్‌’ అని చెప్పొచ్చేమో. తాజాగా ఈ రోజు కూడా అదే పని చేశారు. మంచి ‘తొమ్మిది’ వచ్చేలా సాయంత్రం 4:05కి మహేష్‌ సినిమా అప్‌డేట్‌ ఇస్తామని ప్రకటించారు. తీరా ఆ సమయానికి మూడు నిమిషాల ముందు అంటే 4:02కి There is a slight delay in our SUPER NEWS, but we’re sure it will be worth it! అని మెసేజ్‌ పెట్టారు.

అక్కడితో ఆగిపోయున్నా బాగుండు… If you know, you know, sometimes delays happen! అని మరో మెసేజ్ పెట్టి పుండు మీద కారం చల్లారు. మీకు తెలుసు కాదు కొన్ని సార్లు ఆలస్యమవుతుంది అనే అర్థంలో కన్ను కొట్టిన ఎమోజీ పెట్టారు. ఇదంతా చూస్తుంటే హారిక హాసిని టీమ్‌ కావాలనే ఫ్యాన్స్‌ వెయిట్‌ చేయించి ఉత్సుకతను పెంచడానికి ఆలస్యం చేస్తోందా అనిపిస్తోంది. ఒకవేళ టెక్నికల్‌ ఇష్యూ ఉంటే ఒకసారో, రెండుసార్లకో సర్దుకోవాలి. కానీ ప్రతిసారి ఇలా గంట, గంటన్నర లేట్‌ చేయడం ఎంతవరకు భావ్యమో వాళ్లకే తెలియాలి. అన్నట్లు 4:05కి ఇస్తామన్న అప్‌డేట్‌ 5:31కి ఇచ్చారు. ఇక్కడ కూడా ‘తొమ్మిది’ మిస్‌ అవ్వలేదు సుమా. ఇక అప్‌డేంట్‌ ఏంటనేది అందరికీ తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత మహేష్‌ – త్రివిక్రమ్‌ కలసి సినిమా చేస్తున్నారు. దానికి ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus