Faima Eliminated: ఫైమా ఎలిమినేషన్ వెనక అసలు కారణం ఇదేనా..?

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం అనూహ్యంగా ఫైమా ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి లాస్ట్ వీక్ ఫైమా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ, ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటం వల్ల బ్రతికిపోయింది. రాజ్ బలైపోయాడు. లేదంటే లాస్ట్ వీక్ బ్యాగ్ సర్దేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఈవారం నామినేషన్స్ లో పైమా ఉండేది కాదు, కానీ రేవంత్ చాలా బలంగా ఫైమాకి ఓటు వేశాడు. తనని నామినేట్ చేసినందుకు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. లాస్ట్ వీక్ ఫైమా టాస్క్ లో పెర్ఫామన్స్ లేకపోయినా , ఈవీక్ టిక్కెట్ టు ఫినాలేలో పార్టిసిపేట్ చేసింది.

అయినా కూడా కొన్ని పాయింట్స్ తేడాతో వెనకబడింది. ఇక తనని చివరి టాస్క్ లో తీస్కోవాలని చాలా గొడవ కూడా చేసింది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఎవిక్షన్ ఫ్రీపాస్ కేవలం తనకోసమే వాడుకోవడం వల్ల ఇంకో వారం ఇంట్లో ఉండగలిగింది. ఫైమా ఎలిమినేషన్ కి ఒక్కసారి కారణాలు చూసినట్లయితే., ఫస్ట్ 5 వారాలు గేమ్ బాగా ఆడింది. ఎప్పుడైతే సుదీపతో, మెరీనాతో వెటకారం స్టార్ట్ చేసిందో అప్పట్నుంచీ ఫైమాకి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. తనని ప్రేమించి ఓట్లు వేసేవాళ్లు కూడా వేరే వాళ్లకి షిప్ట్ అయిపోయారు. దీంతో పైమా ఓటింగ్ లో వెనకబడింది.

ఇక గేమ్ లో టాస్క్ ల పరంగా బాగా ఆడినా కూడా నామినేషన్స్ అప్పుడు చూపించే అతి, వెటకారం, టాస్క్ ల్లో లాజిక్స్ అన్నీ ఫ్లాప్ అవుతున్నా వాదనకి దిగడం ఇవన్నీ పైమా గేమ్ ని దెబ్బతీశాయి. అంతేకాదు, ఆదిరెడ్డితో , రాజ్ తో జతకట్టి వేరేవాళ్లని టార్గెట్ చేయడం కూడా ఫైమా గేమ్ ని దెబ్బతీసిందనే చెప్పాలి. రేవంత్ ని ఫిజికల్ అవుతున్నావంటూ వాడిన స్ట్రాటజీ ఆడియన్స్ కి నచ్చలేదు. తన వీక్ నెస్ తో ఆడుకోవడం, గీతు చేసిన పనే తను కూడా చేయడం అనేది ఈసీజన్ లో ఆడియన్స్ కి అస్సలు ఎక్కలేదు.

గీతు గేమ్ ని తప్పుబట్టిన ఆడియన్స్ సేమ్ పాయింట్ లో పైమా గేమ్ ని కూడా తప్పుబట్టారు. ఇక గేమ్ లో తనని తాను ప్రూవ్ చేసుకునే అవకాశాలు వచ్చినా కూడా ఫస్ట రౌండ్ లోనే అవుట్ అయిపోయింది. ముఖ్యంగా టాస్క్ లు ఆడుతున్నప్పుడు వేరేవాళ్లని టార్గెట్ చేస్తూ, బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇనయాని కూడా టీజ్ చేయడం చేసింది. దీంతో ఇనయా ఫ్యాన్స్ అందరూ ఫైమాని టార్గెట్ చేశారు.

ఇక ఈసారి తనకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ నామినేషన్స్ లో ఉండటం అనేది ఫైమాకి కలిసిరాలేదు. అంతకముందు మెరీనా, వాసంతీ, బాలాదిత్య, ఇలా కొంతమంది లీస్ట్ లో ఉండి ఎలిమినేట్ అవ్వడం వల్ల ఫైమా బ్రతికిపోయింది. ఈసారి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఈవారం కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే చేసిన బిగ్ బాస్ వచ్చేవారం ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus