Faima: బాలాదిత్యని గీతు అంత మాట అన్నదా..? టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బాస్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు హౌస్ మేట్స్ అందరూ. మార్నింగ్ అపరిచితుడు వేషంలో సూర్య, ఫైమా అద్భుతంగా నవ్వించారు. ఫైమా చంద్రముఖిగా మారి, సూర్యని ఆటపట్టించింది. అపరిచుతుడిగా డైలాగ్స్ చెప్తూ సూర్య తనదైన స్టైల్లో మిమిక్రీ చేశాడు. ఇక్కడే సూర్యని టీజ్ చేసింది ఫైమా. దీంతో హౌస్ మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి ఇనయ హౌస్ లో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలని చెప్పింది.

దీంతో సంతృప్తి చెందిన బిగ్ బాస్ ఇనయకి కేక్ ఇచ్చి పంపించాడు. ఆ కేక్ ని హౌస్ లో అందరితో షేర్ చేసుకుంది ఇనయ. ఇక బాలాదిత్య మాస్టర్ గా , మిగతా హౌస్ మేట్స్ పిల్లలుగా రెచ్చిపోయి స్కిట్ చేశారు. బాలాదిత్య పిల్లలుగా మారిన హౌస్ మేట్స్ ని ప్రశ్నలడుగుతూ స్కిట్ ప్రారంభించాడు. ఇక్కడే గీతు మాస్టర్ మాస్టర్ ఇది మా నాయన కట్టించిన స్కూల్ అని, బీప్ సౌండ్ తో ఒక మాట అనేసింది. దీనికి బాలాదిత్య రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ గీతు ఏ మాట అన్నదా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ స్కిట్ లో ఫైమా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, డైలాగ్స్ చెప్తూ రెచ్చిపోయింది. చంటి దగ్గరకి వచ్చి జోక్స్ వేసింది. చంటికి ఝలక్ ఇచ్చింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ కడుపుబ్బ నవ్వారు. రేవంత్, సూర్య ఇద్దరూ కిందపడి మరీ నవ్వుకున్నారు. బాలాదిత్య పిల్లలని కంట్రోల్ చేయలేకపోయాడు. చివరకి స్కిట్ లో నుంచీ పారిపోయాడు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ స్కిట్ హైలెట్ గా నిలిచింది. ఫైమా కామెడీ కొద్దిగా శృతిమించినా కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది.

తోటి హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ టాస్క్ లో అద్భుతంగా పెర్ఫామన్స్ ఇచ్చినవాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఈ కెప్టెన్సీ టాస్క్ రెండు లెవల్స్ లో జరగబోతోంది. ఇందులో గీతు, బాలాదిత్య, రేవంత్, ఫైమా , చంటి వీళ్లు పోటీపడబోతున్నారు. ఇక మిగతా కంటెస్టెంట్స్ ఎవరూ అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక తెలుస్తుంది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus