Faima: నూతన గృహప్రవేశం చేసిన ఫైమా… వీడియో వైరల్!

పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఫైమా ఒకరు. ఇలా పటాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. ఇలా జబర్దస్త్ కామెడీ వెనుక గుర్తింపు సంపాదించుకున్నటువంటి తన కామెడీ పంచ్ డైలాగులతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేశారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను పైన అభిమానులతో పంచుకునేవారు.

ఇక తాము ముగ్గురు ఆడపిల్లలమని మమ్మల్ని పెంచడం కోసం తన తల్లి చాలా కష్టపడిందని పలు సందర్భాలలో తెలియజేశారు. తన తల్లి మమ్మల్ని పెంచి పెద్ద చేశారని తెలిపారు. ఇక మేము పుట్టినప్పటినుంచి మాకంటూ ఒక సొంత ఇల్లు లేదు తన తల్లికి ఎప్పటికైనా సొంత ఇల్లు ఇవ్వాలనేది తన కోరిక అని తెలిపారు. ఇలా తన తల్లికి సొంత ఇల్లు నెరవేర్చాలని ఉద్దేశంతోనే ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి మరి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.

అయితే ఈ కార్యక్రమంలో సంపాదించిన డబ్బుతో తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు ఇలా సొంత ఇల్లు నిర్మించినటువంటి ఈమె గృహప్రవేశం చేశారు. ఈ విధంగా ఫైమా తన కష్టార్జితంతో తన తల్లి సొంత ఇంటికలను నెరవేర్చి ఇంట్లోకి గృహప్రవేశం చేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను పైమా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఫైమా (Faima)  మా లో ప్రసారమవుతున్న బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags