Jr NTR: తారక్ ప్రతిభపై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ప్రశంసల వర్షం.. ఏమైందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ డ్యాన్స్ గురించి ఇప్పటికే ఎంతోమంది స్టార్ కొరియోగ్రాఫర్లు ప్రశంసించారు. ఎలాంటి రిహార్సల్స్ లేకుండానే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారని అభిమానులు భావిస్తారు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిన్ దేవర (Devara) సినిమా కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం థాయిలాండ్ లో దేవర సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ పాటకు బాస్కో మార్టిన్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను బాస్కో మార్టిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభాశాలి అని తారక్ తో పని చేయడం గొప్ప అదృష్టమని బాస్కో మార్టిన్ చెప్పుకొచ్చారు. బాస్కో మార్టిన్ చెప్పిన విషయాలు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. దేవర రిలీజ్ కు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

దేవర సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోందని తెలుస్తోంది. ఈ సినిమా సీడెడ్ హక్కులు 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వరుసగా మాస్ సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు ఫ్యాన్స్ ను అంచనాలకు మించి మెప్పించడం ఖాయమని తెలుస్తోంది.

కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న తారక్ బాక్సాఫీస్ ను తన సినిమాలతో షేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటే చూడాలని ఉందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus