సినీ పరిశ్రమలో విషాదం.. సినిమాటోగ్రాఫర్, నిర్మాత.. సి.రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత..!

  • August 19, 2022 / 06:49 PM IST

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు,నిర్మాత అయిన సి.రాజేంద్ర ప్రసాద్ ఈరోజు తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా న్యూమోనియాతో సహా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన.. ఓ దశలో కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నట్టు కనిపించారు. కానీ ఈ మధ్య మళ్ళీ పరిస్థితి విషమించడంతో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నారట. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఈయన వైద్య నిపుణులు తెలిపారు. ఈరోజు ఆయన కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. ఈయన వయసు 55 సంవత్సరాలు ఉంటుందట. ‘ఆ నలుగురు’ చిత్రానికి దర్శకుడు అయిన చంద్ర సిద్ధార్థకి ఈయన సోదరుడు.

1995లో వచ్చిన ‘నిరంతరం’ కు రాజేంద్ర ప్రసాద్ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. ‘నిరంతరం’ సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. హాలీవుడ్‌లో ‘మన్ విమన్ అండ్ ది మౌస్’, ‘రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్’ ‘ఆల్ లైట్స్, నో స్టార్స్’ చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

తెలుగులో అయితే ‘మేఘం’,’శిశిర’ ‘హీరో’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు సి.రాజేంద్ర ప్రసాద్. బాలీవుడ్లో కూడా చాలా సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. రాజేంద్ర ప్రసాద్ ముంబైలో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సి.రాజేంద్ర ప్రసాద్ గారి మరణం టాలీవుడ్ కు తీరని లోటని, టాలీవుడ్ స్థాయి పెంచిన ఫిలిం మేకర్స్ లో ఆయన కూడా ఒకరని టాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus