C Kalyan: 99 రూపాయలకే సినిమా అన్న సి.కళ్యాణ్.. ఆ కామెంట్లు పట్టించుకోవద్దంటూ?

ఏపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా సినిమా రిలీజైన రోజే టీవీలో సినిమాను చూసే అవకాశాన్ని కల్పించనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే కొంతమంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. టీవీలో చిన్న సినిమాలు చూసే అవకాశం లభిస్తే థియేటర్లు మూతబడే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై నట్టి కుమార్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే సి.కళ్యాణ్ మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో అధికారిక లాంఛ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇతర దేశాలలో సైతం ఈ తరహా ప్రయోగం జరగలేదని చెప్పారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో వల్ల చిన్న సినిమాల మారుమూల గ్రామాలలో నివశించే ప్రేక్షకులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు అని  (C Kalyan) సి.కళ్యాణ్ కామెంట్లు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్లకు, థియేటర్లకు ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి ఇబ్బంది పడనని ఆయన కామెంట్లు చేశారు. ఈ నిర్ణయం చిన్న సినిమాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సి.కళ్యాణ్ అన్నారు.

ఇది మంచి ప్రయోగమని ఈ ప్రయోగం వల్ల చిన్న సినిమాలు బ్రతుకుతాయని ఆయన కామెంట్లు చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో గురించి కొంతమంది చేస్తున్న నెగిటివ్ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో స్కీమ్ ద్వారా సినిమా రిలీజ్ రోజే 99 రూపాయలకే ఇంటి వద్ద కూర్చుని సినిమా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. రీఛార్జ్ చేసుకుంటే ఒక్కరోజు వ్యాలిడిటీతో సినిమాలను చూసే అవకాశం ఉంటుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus