Balakrishna: బాలయ్య క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందిగా.. బాలయ్య గొప్పోడంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో బాలయ్య ఒకరు కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న బాలయ్య ఈ సినిమా పూర్తైన వెంటనే బాబీ సినిమాతో బిజీ కానున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమాలో పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేయనున్నారని తెలుస్తోంది. బాలయ్య బాబీ కాంబో మూవీ వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో రిలీజ్ కానుందని సమాచారం.

జై బాలయ్య అనే స్లోగన్ ను బాలయ్య అభిమానులు ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర హీరోల అభిమానుల ఈవెంట్లలో సైతం పలు సందర్భాల్లో ఈ స్లోగన్ హాట్ టాపిక్ అయింది. వీరసింహారెడ్డి మూవీలో జై బాలయ్య అనే స్లోగన్ కు సంబంధించి ఉన్న డైలాగ్స్ ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయనే సంగతి తెలిసిందే.

వెస్ట్‌ ఇండీస్ స్టార్‌ క్రికెటర్‌ హెట్‌మైర్‌ ఒక పబ్ లో జై బాలయ్య అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్యకు ఉన్న క్రేజ్ ఇదీ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడితే మాత్రం ఆయన క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలయ్య మాస్, యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

బాలయ్య (Balakrishna) మార్కెట్ భారీగా పెరుగుతుండగా యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లు బాలయ్యతో పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య భగవంత్ కేసరి మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అటు బాలయ్య , ఇటు థమన్ కెరీర్ బెస్ట్ హిట్ సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus