చెర్రీ…ఎందుకో… ఈ పొగడ్తలు!!!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తెజ్, నిన్న ఫేస్‌బుక్ లివ్ చాట్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించాడు. అయితే లివ్ చాట్ లో భాగంగా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు. ఎవ్వరూ ఊహించని విధంగా అటు ప్రిన్స్ మహేష్ ను, ఇటు ప్రభాస్ ను పోగుడుతూ….మహేష్ గుడ్ లుక్స్ తో పాటు అతడి యాక్టింగ్ టాలెంట్ తనకు బాగా నచ్చుతుందని అదేవిధంగా హీరో ప్రభాస్ తన సన్నిహిత మిత్రుడని, ఈ మధ్యనే ‘బాహుబలి 2’ క్లైమాక్స్ షూటింగ్ చూసి వచ్చానని ఆ సినిమా అద్భుతంగా వస్తోంది అంటూ వారిద్దరిపై ప్రశంసలు కురిపించాడు.

అయితే అదే క్రమంలో మెగా ఫ్యామిలీ మధ విభేదాలు లేవు అని మరో సారి నిరూపిస్తూ…కల్యాణ్ బాబాయితో సినిమా చెయ్యాలి అని అనుకుంటున్నా అని…అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం లోనే తాము ఇద్దరం నటించే సినిమా మొదలు అవుతుంది అని అంటూ తన బాబాయ్ పవన్ గ్రీన్ సిగ్నల్ గురించి ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపాడు. ఇక చిరు 150వ సినిమా గురించి సైతం ఊహించని ట్విష్ట్ ఇచ్చాడు…ఈ సినిమాకు తాను కేవలం నిర్మాతనేని తాను నటిస్తున్నా అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అని తెలిపాడు.

ఇక ఈ సినిమా పేరు కత్తిలాంటివాడు కాదు అని, ఇంకా పవర్‌ఫుల్ టైటిల్ కోసం చూస్తున్నాం అని చెర్రీ తెలిపాడు. ఇక తన సినిమా విశేషాల గురించి సైతం చెర్రీ అభిమానులతో పంచుకున్నాడు. ఇలా చెర్రీ అభినానులతో ముచ్చటించడంతో అభిమానులు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus