The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

ఏ హీరో ఫ్యాన్స్‌కీ రాకూడని కష్టం నిన్న రాత్రి ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి వచ్చింది. అలాగే ఏ ఫ్యాన్సూ చేయని రచ్చ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిన్న రాత్రే చేశారు. థియేటర్లలో మొసలి బొమ్మలు తీసుకొచ్చి నానా హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రీమియర్‌ షోలు, టికెట్‌ రేట్ల విషయం తేలక తొలుత థియేటర్ల ముందు నానా హంగామా చేసిన ఫ్యాన్స్‌ ఆ తర్వాత.. సినిమాల లెక్క తేలడంతో థియేటర్లలో మొసలి బొమ్మలతో సందడి చేశారు.

The Rajasaab

ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ అలియాస్‌ ‘ప్రభాస్‌ రాజా సాబ్‌’ (ఈ అలియాస్‌ కథేంటో ఆఖరున చూద్దాం) సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుండి మొసలి మీమ్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమా విడుదలయ్యాక కొంతమంది అభిమానులు ఏకంగా మొసలి బొమ్మలను తీసుకెళ్లారు. సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్‌ మొసలితో ఫైట్‌ చేసే సన్నివేశం వచ్చే సమయంలో ఆ బొమ్మలతో స్క్రీన్‌ వద్దకు వెళ్లి దాన్ని రీక్రియేట్‌ చేశారు. అయితే ఇవి ఏఐతో వీడియోలంటూ కొన్ని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

కొంతమంది ఆ వీడియోలను చూసి ఎంజాయ్‌ చేస్తుంటే.. మరికొందరు అతి అవుతోంది అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం మొసళ్లు తీసుకొస్తే.. ‘సలార్‌ : శౌర్యాంగపర్వం’ సినిమాకు డైనోసార్‌ బొమ్మలు తీసుకొస్తారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో ప్రభాస్‌ పాత్రను డైనోసార్‌తో పోల్చిన విషయం తెలిసిందే. మరి ఆ సినిమా వచ్చినప్పుడు ఫ్యాన్స్‌ అలా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక పైన చెప్పిన అలియాస్‌ గురించి చూద్దాం.

సినిమా టైటిల్‌ అనౌన్స్‌ అయిన తొలి రోజుల నుండి టైటిల్‌ను ‘ది రాజా సాబ్‌’ అనే పిలుస్తూ వచ్చారు. అయితే సినిమాకు వచ్చేసరికి ‘ప్రభాస్‌ రాజాసాబ్‌’ అని ఇచ్చారు. మరి ఎందుకు మార్చారు అనేది టీమే చెప్పాలి.

‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus