The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్'(The RajaSaab) అనే పాన్ ఇండియా మూవీ రూపొందింది. నిధి అగర్వాల్,మాళవిక మోహనన్,రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జరీనా వాహాబ్ వంటి బాలీవుడ్ నటులు కూడా అత్యంత కీలక పాత్రలు పోషించారు.తమన్ సంగీత దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

The RajaSaab

ప్రమోషనల్ కంటెంట్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రభాస్ మార్కెట్ పై ఆధారపడి ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 52cr
సీడెడ్ 24 cr
ఉత్తరాంధ్ర 16 cr
ఈస్ట్ 10 cr
వెస్ట్ 7.2 cr
కృష్ణా 8.0cr
గుంటూరు 12.6 cr
నెల్లూరు 4.5 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 134.3 cr
కర్ణాటక+తమిళనాడు+కేరళ 15 cr
నార్త్ 60 cr
ఓవర్సీస్ 40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 249.3 cr

‘ది రాజాసాబ్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.249.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.250 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నది కాదు. ఎంత ప్రభాస్ ఉన్నప్పటికీ.. సంక్రాంతికి పోటీగా ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ‘అనగనగా ఒక రాజు’ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి క్రేజీ సినిమాలు పోటీగా రిలీజ్ కాబోతున్నాయి. సో ఆడియన్స్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. కాబట్టి ‘ది రాజాసాబ్’ కి ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి.

‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus