Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఆ సినిమాల అప్ డేట్స్ వస్తాయా?

ఈ నెల 23వ తేదీ ప్రభాస్ పుట్టినరోజు కాగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ది రాజాసాబ్, స్పిరిట్, ప్రభాస్ హను రాఘవపూడి కాంబో సినిమాల నుంచి ఏవైనా అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ప్రభాస్ పుట్టినరోజున సలార్ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ ఏవైనా వస్తాయేమో చూడాల్సి ఉంది. సలార్ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.

Prabhas

సలార్ సీక్వెల్ శౌర్యాంగపర్వం అనే టైటిల్ తో తెరకెక్కనుండగా ప్రశాంత్ నీల్ వైపు నుంచి ఈ సినిమాకు సంబంధించి స్పష్టత లేదు. సలార్ సీక్వెల్ ఎప్పుడు విడుదలైనా సంచలన రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సీక్వెల్ కు ప్రభాస్ 2026లోనే డేట్స్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్ కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ప్రభాస్ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కినా ప్రేక్షకాదరణ అయితే పొందుతున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సీక్వెల్ కు ఇతర నటీనటుల డేట్స్ కూడా ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. సలార్2 సినిమాపై ఇతర భాషల్లో సైతం అంచనాలు పెరుగుతున్నాయి.

సలార్ సీక్వెల్ లో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది. సలార్2 సినిమా వీలైనంత వేగంగా రిలీజైతే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్2 సినిమా బడ్జెట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు సలార్1 మూవీ భారీ లాభాలను అందించింది. సలార్2 కూడా ఆ బ్యానర్ కు భారీ హిట్ అందిస్తుందేమో చూడాలి. ప్రభాస్ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలు సక్సెస్ సాధించడానికి తన వంతు కృషి చేస్తున్నారు.

జోకర్: ఫోలీ ఏ డ్యూయెక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus