మరోసారి రేణు దేశాయ్ పై విమర్శలు గుప్పిస్తున్న పవన్ ఫ్యాన్స్!

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తీరు చూస్తుంటే… “ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న… ఏరు దాటాక బోడి మల్లన్న..” అనే సామెత గుర్తొస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆమెను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొని ఏళ్ళు గడుస్తున్నా ఆమెను వదినగా ఎంతో అభిమానంగా పిలుచుకునే అభిమానులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకలా మారిపోయారో… వివరాల్లోకి వెళితే.. రేణు దేశాయ్ తాను మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియా వేదికపై మాటల దాడి మొదలయింది. ఇక నిశ్చితార్ధం చేసుకువడంతో ఆవేశం తట్టుకోలేక నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ నెగిటివిటీ తట్టుకోలేక ట్విట్టర్ నుంచి బయటికి వెళ్లారు.

అయినా ఆమెపై విమర్శలు చేసేవారు తగ్గిపోలేదు. దీంతో రేణు మనసులో దాచుకున్న భావాలను వ్యక్తపరుస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలలో రేణు తాను వదినను కాదని.. అన్నాను వదినగా భావించాలంటూ పవన్ ఫ్యాన్స్ కు చెప్పటంతో పాటు.. పవన్ ను పరోక్షంగా ప్రశ్నించారు. దీంతో  పవన్ అభిమానులు రేణూపై మరోసారి ట్రోలింగ్ కు దిగారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేణు “మేమిద్దరం విడిపోయాక.. అన్నా లెజ్ నెవాను పవన్ పెళ్లాడారు. ఆమె ద్వారా మళ్లీ తండ్రి అయ్యారని తెలుసుకున్నాను. అప్పుడు పవన్, అన్నా లెజెనోవాకి కంగ్రాట్స్ చెప్పాను” అని చెప్పారు. ఇవి పవన్ తో సంబంధాలు బాగా ఉన్న సమయంలో రేణూ మాట్లాడిన మాటలు. ఇప్పుడు మరొక వ్యక్తిని  పెళ్లి చేసుకుంటున్న సమయంలో మాట్లాడుతున్న మాటలు తప్పంతా పవన్ దే అనే రీతిలో ఉంది.

దీనిని పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రేణూ పాత వీడియోక్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆమెపై మాటల దాడికి దిగుతున్నారు. దీనికి రేణు సమాధానం ఏంటో? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొక ఇంటర్వ్యూ లో వీటిపై రేణు స్పందిస్తుందా? ఇంటర్వ్యూ లు ఇవ్వడం ఆపేస్తుందా?.. పవన్ కల్పించుకొని వార్ ని ఆపేస్తారా?..  ఏమైనా జరగొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus