డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

రామ్ పోతినేని (Ram) హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘స్కంద’ (Skanda) అనే సినిమా వచ్చింది. ‘జీ స్టూడియోస్’ తో కలిసి ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ సంస్థ అధినేత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో.. అంటే దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్ ఉంది. అందువల్ల సినిమాకి బిజినెస్ చాలా బాగా జరిగింది. రిలీజ్ కి ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి.

Ram Pothineni

థియేట్రికల్ బిజినెస్ అయితే ఏకంగా రూ.43 కోట్లు జరిగింది. కానీ మొదటి రోజు ‘స్కంద’ (Skanda) సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ముందు నుండి హైప్ కారణంగా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తర్వాత మాస్ సెంటర్స్ లో కూడా బాగానే నిలబడింది. నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ ను తట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద ‘స్కంద’ సినిమా రూ.33 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. మిడ్ రేంజ్ హీరోల్లో ఇలాంటి ఫీట్ సాధించింది ఒక్క రామ్ (Ram) మాత్రమే అని చెప్పాలి. అది కూడా బోయపాటి శ్రీను సినిమాలకి మాస్ లో ఉన్న క్రేజ్ కారణంగా అని చెప్పాలి.

అయితే ‘స్కంద’ (Skanda) సినిమా క్లైమాక్స్ లో రామ్ (Ram) డబుల్ రోల్ ప్లే చేసినట్టు ఓ ట్విస్ట్ ఇచ్చాడు బోయపాటి. అంతేకాదు ‘స్కంద’ కి (Skanda) సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు రివీల్ చేశారు. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది కాబట్టి.. సీక్వెల్ తీసే ఛాన్స్ లేదు. కానీ రామ్ పోతినేని అభిమానులు మాత్రం ‘స్కంద 2’ కావాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

సినిమాలో కడప కుర్రాడిగా రెండో రామ్ ని (Ram) పరిచయం చేశారు. రాయలసీమ స్లాంగ్ లో రామ్ చెప్పిన డైలాగులు కూడా ఫ్యాన్స్ కి నచ్చాయి. పార్ట్ 2 కూడా ఆ పాత్రతో ఉంటుందని ప్రకటించారు కాబట్టి.. ‘స్కంద 2’ కావాలని కోరుతూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కానీ మేకర్స్ అందుకు సాహసిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus