ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ “కల్కి 2” కంటే కూడా ఎక్కువగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ “స్పిరిట్”. ప్రభాస్ ను (Prabhas) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రాజెక్ట్ చేయనున్నాడు సందీప్ రెడ్డి వంగా. సినిమా అనౌన్స్మెంట్ టైమ్ నుంచి మంచి హైప్ ఉంది ఈ సినిమాకి. ఇక సినిమాలో హీరోయిన్ గా దీపిక పడుకొనెను తప్పించడం, ఆమె స్థానంలో తృప్తిని తీసుకోవడం వంటివి సినిమాని అనునిత్యం వార్తల్లో ఉండేలా చేసింది.
అయితే.. కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) నటించనున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది. అది కూడా ప్రభాస్ (Prabhas) తండ్రి పాత్రలో అని ప్రభాస్ ఫ్యాన్ పేజస్ నుంచి మొదలైన వార్త మీమ్ పేజీల వరకు పాకింది. ఆ వార్తలో నిజమెంత అనేది మెగా కాంపౌండ్ లో చెక్ చేయగా.. అసలు అలాంటి డిస్కషన్ కూడా జరగలేదని తెలిసింది.
విషయం ఏంటంటే.. ప్రభాస్, (Prabhas) చిరంజీవి (Chiranjeevi) కాబినేషన్ లో అప్పట్లో నాగ్ అశ్విన్ ఒక సినిమా అనుకున్నాడు. అది వర్కవుట్ అవ్వలేదు. అది కూడా తండ్రీకొడుకులుగా కాదు, ఒక డిఫరెంట్ థీమ్ తో. మరి ఇప్పుడు ఈ స్పిరిట్ కాంబినేషన్ న్యూస్ ఎందుకు వైరల్ అవుతుంది అనే విషయం అర్థం కావడం లేదు. ఇకపోతే.. చిరంజీవి కూడా మరో హీరో సినిమాలో ఇప్పుడప్పుడే తండ్రి పాత్రలో కనిపించడానికి రెడీగా లేరు.
ఆయన ఆల్రెడీ మూడు సినిమాలు సైన్ చేసి ఉన్నారు. చిరంజీవికి ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది కానీ.. అది ఇంకొన్నాళ్ళ తర్వాత. దానికి ఇంచుమించుగా ఒక ఏడేళ్ల సమయం పట్టొచ్చు. అప్పుడు ఆయన కూడా అమితాబ్ లాగా తండ్రి లేదా తాత పాత్రలు చేద్దామనుకుంటున్నారట. సో, స్పిరిట్ లో చిరంజీవి అనే వార్తకు ఇప్పటికైనా తెర దించడం బెటర్.