RRR Trailer: లీకైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు మొత్తం భారతీయ సినీ పరిశ్రమ భారీ అంచనాలను పెట్టుకుంది. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేసింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఉదయం 10 గంటలకు ‘‘ఆర్ఆర్ఆర్’’ ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతానికి ఈ ట్రైలర్‌ను థియేటర్లలో మాత్రమే విడుదల చేయగా సాయంత్రం యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.

తెలుగు రాష్ట్రాలలో దాదాపు 200 వందలకు పైగా థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ నిడివి మూడు నిమిషాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ట్రైలర్‌ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉన్నట్లు చెబుతున్నారు చూసిన అభిమానులు. ఇంత వరకు బాగానే వున్నా.. కొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ స్ట్రాటజీపై పెదవి విరుస్తున్నారు. థియేటర్‌లో కొందరు మాత్రమే చూడగలరని.. అదే యూట్యూబ్‌లో రిలీజ్ చేసి వుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే థియేటర్‌లో చూసిన వారు దానిని ఎలాగూ సోషల్ మీడియాలో పెట్టేస్తారు. దీని వల్ల ఆర్ఆర్ఆర్ టీంకి వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అదే నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసి వుంటే వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఇలా .. కొన్ని రికార్డులు అదనంగా వచ్చే అవకాశం వుంది కదా అని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో బాహుబలి 2 విషయంలోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేశారు. అప్పుడు కూడా ముందు థియేటర్లలో తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. దీని వల్ల యూట్యూబ్ వ్యూస్ భారీగా పడిపోయాయి. మరి దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ అదే వ్యూహాన్ని జక్కన్న ఎందుకు అమలు చేశారో మరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus