Devara: దేవర సినిమా లాంగ్ రన్ ను డిసైడ్ చేసే సీన్లు ఇవే.. కానీ?

2024 సంవత్సరంలో విడుదల కానున్న సినిమాల్లో దేవర సినిమా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ ఉండనుందని తెలుస్తోంది. ఈ వార్త సినిమాపై అంచనాలను పెంచింది. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన కార్తికేయ2, కాంతార సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోయినా ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం. ఈ సీన్లు దేవర సినిమా లాంగ్ రన్ ను డిసైడ్ చేయనున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వార్త నిజమైతే మాత్రం దేవర సినిమా సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉందని కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారని తెలుస్తోంది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగ రోజుగా ఉండనుంది.

జూనియర్ ఎన్టీఆర్ లాభాల్లో వాటా తీసుకుంటూ ఈ సినిమాలో నటిస్తుండటంతో బడ్జెట్ హద్దులు దాటడం లేదని తెలుస్తోంది. తారక్ రెమ్యునరేషన్ వాటాతో కలిపి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ వార్2, ప్రశాంత్ నీల్ కాంబో సినిమాల గురించి కూడా దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పష్టత ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో మరో క్రేజీ సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ తో మరో సినిమా గురించి జక్కన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. (Devara) దేవర రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus