అజిత్ ‘వేదాళం’ సినిమాను చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు అనే వార్త రాగానే… మళ్లీ రీమేక్ సినిమానా అని నిట్టూర్చారు ఫ్యాన్స్. ఆ తర్వాత మంచిగా తీస్తే బాగుండు చూద్దాం అనుకున్నారు. ఆ వెంటనే ఆ సినిమాకు డైరక్షన్ మెహర్ రమేశ్ అనేసరికి కాస్త ఢీలా పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఇలా ఈ సినిమా గురించి ఫ్యాన్స్ రోలర్ కోస్టర్ జర్నీ చేస్తూనే ఉన్నారు. తాజాగా అభిమానుల్లో మరో చర్చ నడుస్తోంది.
అయితే ఇది కేవలం ఒక్క సన్నివేశం కోసం మాత్రమే. అవును ఒకే ఒక్క సీన్ కోసమే.‘వేదాళం’ సినిమా చూసేవాళ్లకు ఆ సీన్ స్పెషల్ తెలుస్తుంది కానీ.. చూడని వాళ్లకు అంతగా అర్థం కాదు. సినిమాలో ఓ సందర్భంలో అజిత్ ఏడుస్తూ, ఏడుస్తూ, ఒక్కసారిగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారుస్తాడు. అలా బిగ్గరగా నవ్వేస్తాడు. ఆ సీన్ చూసిన ఆపోజిట్ యాక్టర్‌కు, ప్రేక్షకులకు ఒక్కసారిగా గూస్ బంప్స్ పక్కా అని చెప్పొచ్చు.
ఆ సినిమా గురించి ఆ రోజుల్లో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ సీన్ గురించే చెప్పేవారంటే అతిశయోక్తి కాదు. అలాంటి సీన్‌ను ఇప్పుడు చిరంజీవి ఎలా మెప్పిస్తారు అనేది ఇక్కడ విషయం. 40 ఏళ్ల అనుభవం ఉన్న చిరంజీవి ఎలా చేస్తాడు అని అడగడం, వేచి చూడటం తప్పు అని అనొచ్చు. అయితే రీమేక్‌లు చేసేటప్పుడు ఈ కంపారిజన్‌లు వస్తాయి. అక్కడ అదరగొట్టాడు హీరో… ఇక్కడేంటి ఇలా అనే మాటలు పడతాయి. రివ్యూల్లో ఈ మేరకు మాటలూ ఉంటాయి.
అందుకే ఫ్యాన్స్ ఆ సీన్ కోసం కచ్చితంగా ఎదురుచూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. విదేశాల్లో ఉన్న విలన్‌ను కవ్వించి దేశానికి వచ్చేలా చేసి, మొదటిసారి కలుసుకున్నప్పుడు ముందు అమాయకంగా నటించి తర్వాత క్రూరంగా నవ్వే సీన్ మీరు చూశారా? అయితే తెలుగులో చిరు ఎలా చేశారో 11వ తేదీన చూడండి. ఆ రోజే (Bhola Shankar) ‘భోళా శంకర్’ వస్తాడు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!