Ori Devuda: హిట్ టాక్ వచ్చినా.. జనాలు రావడం లేదే!

సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్టామినా హీరోలకు ఉండాలి. కానీ విశ్వక్ సేన్ ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నారు. దీపావళి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా కూడా ఉంది. వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించారు. తమిళ సినిమా ‘ఓ మై కడవులే’కి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్వత్ తెలుగు వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేశారు.

మొదటిరోజు నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ లో మాత్రం జోరు కనిపించడం లేదు. వీకెండ్ పైగా దీపావళి పండగ.. ఇలా అన్నీ కలిసొచ్చినా సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినా.. థియేటర్లలో మాత్రం సినిమా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఓటీటీలోకి వచ్చిన తరువాత జనాలు బాగానే చూశారు కానీ థియేటర్స్ కి మాత్రం వెళ్లలేదు.

విశ్వక్ సేన్ సరికొత్త కథలను ఎన్నుకుంటూ మంచి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నా.. అతడి సినిమాలు చూడడానికి ఆడియన్స్ మాత్రం థియేటర్లకు రావడం లేదు. ‘ఓరి దేవుడా’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. కనీసం దీపావళి నుంచి సినిమా పికప్ అయితే ఓ మోస్తరు కలెక్షన్స్ తో అందరూ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

సినిమాలో వెంకటేష్ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ పండగ సందర్భంగా ఈ సినిమాకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus