ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా రిలీజై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా “ఫిదా”. హీరోగా వరుణ్ తేజ్ నటించినా సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరోయిన్ సాయిపల్లవి, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఖాతాల్లోకే వెళ్లిపోయింది. ముఖ్యంగా భానుమతి అనే తెలంగాణ పిల్లగా సాయిపల్లవి సహజమైన నటన, అందుకు ఆమె తెలంగాణ యాస నేర్చుకొని చెప్పిన సొంత డబ్బింగ్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఓవరాల్ గా 30 కోట్ల పైనే వసూలు చేసిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు 200% లాభాలు తెచ్చిపెట్టింది.
మరి అలాంటి సినిమా టీవీలో వస్తుందంటే చూడకుండా ఎవరుంటారు చెప్పండి. శేఖర్ కమ్ముల శైలి సహజమైన టేకింగ్ ను ఆస్వాదించేందుకు ఫ్యామిలీ ఆడియన్స్, సాయిపల్లవి చిలిపి అల్లరి కోసం కుర్రకారు టీవీలకు అతుక్కుపోయినట్లున్నారు. అందుకే రికార్డ్ స్థాయిలో తీయార్పీ రేటింగ్ వచ్చింది సినిమాకి. ఒక కంప్లీట్ ఫ్యామిలీ మూవీకి ఈస్థాయి తీయార్పీ రావడం చూసి దర్శకనిర్మాతలు సైతం షాక్ అయ్యారు. ఏదైనా కంటెంట్ ఈ కింగ్ అనే విషయం మరోమారు ఇలా “ఫిదా’ తీయార్పీ రేట్స్ లో ప్రూవ్ అయ్యింది. ఇకనైనా మన అగ్ర దర్శకులు, నిర్మాతలు “లార్జర్ దేన్ లైఫ్” తరహా సినిమాలను కాకుండా కాస్త సహజత్వంతో కూడిన సినిమాలను రూపొందించి ప్రేక్షకుల్ని అలరిస్తారని ఆశిద్దాం.