Devara: దేవరలో ప్రతి సీన్ సంచలనమే.. కొరటాల కుంభస్థలాన్నే కొడుతున్నాడా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దేవర సినిమాతో కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ సాధించాలని ఫిక్స్ అయ్యారు. దేవర సినిమాలోని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ ప్రత్యేకంగా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆచార్య సినిమాతో దెబ్బ ఇన్న కొరటాల శివ దేవర సినిమా మిస్ ఫైర్ అయ్యే అవకాశం లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. కొరటాల శివ ప్రతి సీన్ ను షూట్ చేసిన తర్వాత ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

దేవరలో (Devara) ప్రతి సీన్ సంచలనమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్ ఉంటుందని ఈ ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఈ ఫైట్ కు సంబంధించిన షాట్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కొరటాల శివ ఈసారి కుంభస్థలాన్నే కొట్టనున్నాడని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.

ఛత్రపతి సినిమాలోని ఫైట్ ను మించి ఈ ఫైట్ ఉండనుందని సమాచారం అందుతోంది. భారీ లెవెల్ లో ఈ యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ పారితోషికం కాకుండా ఈ సినిమా కోసం 220 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దేవర షూటింగ్ 50 శాతం కంటే ఎక్కువగా పూర్తైందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను ఈ మూవీ నెరవేరుస్తుందని డబుల్ హ్యాట్రిక్ సాధించిన తారక్ ఈ సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ల్ దిశగా అడుగులు వేస్తారని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus