Jr NTR: తారక్ డెడికేషన్ పై ఫైట్ మాస్టర్లు ఏమన్నారంటే..?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పని చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ లక్ష్మణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత షూటింగ్ కోసం ఒకసారి పార్క్ హయత్ కు పిలిచారని 100 మందితో ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని తనకు చెప్పారని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు.

ఆ ఫైట్ సీక్వెన్స్ 15 రోజుల షెడ్యూల్ కాగా ఎండలు మండుతున్న సమయంలో ఆ సన్నివేశాల షూటింగ్ జరిగిందని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. అలాంటి టైమ్ లో యాక్షన్ సీన్లు చేయడం అంత తేలిక కానప్పటికీ ఎన్టీఆర్ అంకిత భావంతో ఆ సీన్స్ చేశారని రామ్ లక్ష్మణ్ అన్నారు. అద్భుతమైన డెడికేషన్ తో ఆ సన్నివేశాలను ఎన్టీఆర్ పూర్తి చేసినట్టు రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. మరోవైపు నేటి నుంచి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో సైతం ఎన్టీఆర్ కు సంబంధించిన అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. చరణ్, ఎన్టీఆర్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ కు కన్నీళ్లు వస్తాయని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్టీఆర్, చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆయా హీరోల ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus