మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆంథోనీ ఈస్ట్ మన్ (75) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు త్రిస్పూర్ లోని మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన మృతికి మలయాళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆంథోనీ ‘ఇనాయే తేడి’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు.
ఈ సినిమా తరువాత ఐస్ క్రీమ్, వయల్ వంటి సినిమాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇక సీనియర్ నటి సిల్క్ స్మిత వెండితెరకు పరిచయం చేసింది కూడా ఆంథోనీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. సిల్క్ స్మితను వెండితెరకు ఎలా పరిచయం చేశారో వివరించారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో కోడంబక్కంలోని కొందరు యువతులు మేకప్ వేసుకొని ఆడిషన్స్ ఇస్తున్నారట. అక్కడే ఓ యువతి పనిమనిషిలా కూర్చొని ఉందట.
ఆంథోని ఆమెని ఫోటోలు తీసుకొని కొందరు దర్శకులకు చూపించగా.. అందరూ ఆమెనే హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపించినట్లు ఆయన చెప్పారు. ఆమె కూడా హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోవడంతో.. ‘సిల్క్’ అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్లు చెప్పారు. తన పేరు మారుస్తామని చెప్పడంతో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. అప్పుడే ఆమెకి పాపులర్ యాక్ట్రెస్ స్మిత పాటిల్ పేరులో మొదటి పేరుని తీసుకొని పెట్టామని తెలిపారు. తొలి సినిమా సక్సెస్ అవ్వడంతో సిల్క్ స్మితగా మారిపోయిందని చెప్పుకొచ్చారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!