దాసరి మరణాన్ని జీర్ణించుకులేకపోతున్న సినీ తారలు

దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిని సినీప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువుగారు కన్నుమూయడం చిత్రపరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్వీట్ల ద్వారా స్పందనను తెలియజేసారు.

గొప్ప దర్శకుల్లో ఒకరు‘దాసరి నారాయణ రావు నా ప్రియ, సన్నిహిత శ్రేయోభిలాషి. భారతదేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరు. ఆయన మరణం మొత్తం భారత చిత్ర పరిశ్రమకు లోటు. ఆయన కుటుంబానికి నా సంతాపం. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ – రజనీకాంత్‌

చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు‘దాసరి నారాయణ రావు కుటుంబానికి నా సానుభూతి. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు. స్వర్గీయులు కేబీ సర్‌ (కె. బాలచందర్‌) ఆయన్ను ఆరాధించేవారు’ – కమల్‌హాసన్‌

దిగ్భ్రాంతికి గురయ్యాను ‘దాసరి నారాయణ గారి మరణవార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. ఆయన మరణం ఏర్పరచిన లోటు ఎప్పటికీ తీరదు. ఆయన కుటుంబానికి అందరి ప్రార్థనలు తోడుంటాయి’ – మహేశ్‌బాబు

దిగ్గజం ఇక లేదు‘తెలుగు చిత్ర కళామ్మతల్లి కన్న ఒక దిగ్గజం ఇక లేదు. మరువదు ఈ పరిశ్రమ మీ సేవలను. దాసరి నారాయణ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ – ఎన్టీఆర్‌

ఎప్పటికీ సజీవంగానే‘శకం ముగిసింది. కానీ లెజెండ్స్‌ ఎప్పటికీ సజీవంగానే ఉంటారు’ – పూరీ జగన్నాథ్‌

బహుముఖ ప్రతిభాశాలి‘రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు, సంపాదకుడు బహుముఖ ప్రతిభాశాలి దాసరి గారి అస్తమయం. తెలుగు వారికి తీరని లోటు’ – హరీశ్‌ శంకర్‌

మీరెప్పుడూ మాకు జ్ఞాపకం‘దాసరి నారాయణ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మీరెప్పుడూ మాకు జ్ఞాపకం ఉంటారు’.
– రకుల్‌ప్రీత్‌ సింగ్‌

వెలుగును కోల్పోయాం ‘మన చిత్ర పరిశ్రమ.. దారి చూపే వెలుగును కోల్పోయింది. దాసరి నారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ – అల్లరి నరేశ్‌

గొప్ప వ్యక్తి‘దాసరి నారాయణ రావు గారు గొప్ప వ్యక్తి. ఇది చిత్ర పరిశ్రమకు, ఆయన కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా’ – రాజ్‌ తరుణ్‌

మా తరానికి మీరే స్ఫూర్తి ‘హృదయ విదారకమైన వార్త, మనకు తీరని లోటు. దాసరి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మా తరానికి మీరు స్ఫూర్తిదాయకం. మా హృదయాల్లో మీరెప్పుడూ నిలిచి ఉంటారు’ – మారుతి

మీ పనితీరు మమ్మల్ని వీడిపోదు‘మీ ఆత్మకు శాంతి చేకూరాలని దాసరి గారు. మీ గొప్ప పనితీరు మిమల్ని ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుంది’ – వరుణ్‌ తేజ్‌

మాతోనే మీ క్లాసిక్ ‘లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన తన క్లాసిక్స్‌ ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటారు’ – నాని

మీ లోటు తీర్చలేనిది‘దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’. – సునీల్‌

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus