Bigg Boss: సూపర్ సెవన్ లో గెలిచేది ఎవరు..? కావాలనే బిగ్ బాస్ టీమ్ ఇలా చేసిందా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ ఆఖరి వారానికి వచ్చేసింది. ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ఇందులో అనిల్, బాబాభాస్కర్, అరియానా, మిత్రా శర్మా, బిందుమాధవి, అఖిల్, ఇంకా యాంకర్ శివలు ఉన్నారు. వీళ్లలో టైటిల్ ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరం. గత వారాల్లో పోలిస్తే అఖిల్ కి ఇంకా బిందు మాధవికి మద్యలోనే టఫ్ ఫైట్ ఉంటుందని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ చూసినా కూడా బిందుకి అఖిల్ కి మద్యలోనే గట్టి ఫైట్ అనేది ఉండబోతోందని అర్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు హౌస్ లో సూపర్ సెవన్ మెంబర్స్ ని ఫినాలేకి ఎలా తీస్కుని వెళ్తారు. ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది ఆసక్తికరం. ఓటింగ్ ప్రకారం ఫినాలేలో ఎవరికి ఎంత శాతం వస్తుందనేది ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. ప్రతి సీజన్ లో టాప్ – 5 మెంబర్స్ మాత్రమే ఫినాలేలోకి వెళ్తారు. అక్కడ్నుంచీ వాళ్ల జెర్నీలు చూపించడం అనేది బిగ్ బాస్ స్టార్ట్ చేస్తాడు. కానీ, ఈసారి టాప్ – 7 మెంబర్స్ హౌస్ లో ఉన్నారు. ఒక్కొక్కరి జెర్నీ చూపిస్తే వారం రోజులు గడిచిపోతుంది. అంతేకాదు, ఈవారం మేకోవర్ కూడా ఉంటుంది. హౌస్ మేట్స్ ఫినాలేకి సిద్ధమైపోతారు.

ఫైనల్స్ లో ముగ్గురుని ఎలిమినేట్ చేసి, ఇద్దరిని స్టేజ్ పైకి తీస్కుని రావడం అనేది జరుగుతుంది. అయితే, ఈసారి 7గురు సభ్యులు ఉన్నారు కాబట్టి, ముందుగా టాప్ – 5 ఎవరనేది డిక్లేర్ చేయాలి. దీన్ని బట్టే, ఇద్దర్ని ఎలిమినేట్ చేసి, ముగ్గురు హౌస్ లో ఉన్నప్పుడు బ్రీఫ్ కేస్ లో డబ్పులు పంపిస్తారు. ఇది తీసుకుని ఎవరైనా గేమ్ నుంచీ తప్పుకుంటారా లేదా అనేది చూస్తారు. కానీ, ఈసారి ఓటీటీలో ఇలా చేస్తారా లేదే వేరే ప్రక్రియ ఏదైనా ప్లాన్ చేశారా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఫైనల్స్ ఎలా ఉంటుందో ఆడియన్స్ ఊహించగలరు. అయితే, ఈసారి కావాలనే బిగ్ బాస్ టీమ్ ఏడుగురు ఇంటి సభ్యులని ఫైనల్స్ లో పెట్టింది. దీన్ని బట్టీ విన్నర్ ఎవరు అనేది గెస్సింగ్ చేయడం కష్టమే. టాప్ – 5 లో ఎవరుంటారో తెలిసిన తర్వాత వాళ్లలో వాళ్లే కొన్ని లెక్కలు వేసుకుంటారు. దీన్ని బట్టీ ఎలిమినేషన్ జరుగుతున్నప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, ఇక్కడే అఖిల్, బిందు మాధవి మద్యలోనే సోషల్ మీడియాలో టఫ్ ఫైట్ అనేది నడుస్తోంది.

ఈ విషయం ఇంటిలోకి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లినపుడే హౌస్ మేట్స్ కి అర్ధమైంది కూడా. కొంతమంది అయితే, విన్నర్ ని కూడా ఊహించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు. ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో అప్పుడే బిగ్ బాస్ అభిమానులు విన్నర్ ని డిసైడ్ చేసేస్తున్నారు. బిందు ఫ్యాన్స్, అఖిల్ ఫ్యాన్స్ ఇద్దరూ పోటాపోటీగా ఫోటోలని షేర్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus