‘ప్రభాస్ 20’ కి సల్మాన్ టైటిల్?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన 20వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపి కృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్దే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి మొదట ‘జాన్’ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ’96’ రీమేక్ కు ‘జాను’ అని టైటిల్ పెట్టడంతో.. తరువాత ‘ప్రభాస్ 20’ టైటిల్ ను మార్చినట్టు తెలుస్తుంది.

ఇక ఇటీవల ఫిలిం ఛాంబర్ లో ‘యూవీ క్రియేషన్స్’ వారు ‘ఓ డియర్’ , ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను రిజిస్టర్ చేయించినట్టు వార్తలు వచ్చాయి. వీటిలో ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.బాలీవుడ్ లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రానికి ‘రాధే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ప్రభుదేవా డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సల్మాన్ చిత్రానికి కాస్త దగ్గర్లో ఉంది కాబట్టి ‘రాధే శ్యామ్’ అనే ‘ప్రభాస్ 20’ టైటిల్ పెడితే.. మరింతగా ప్రభాస్ సినిమా క్రేజ్ పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ‘సాహో’ చిత్రంతో అక్కడ ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus