‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది రుక్మిణీ వసంత్. ఆ సినిమాకి మెయిన్ హైలెట్ అంటే ఆమె లుక్స్, అలాగే ఆమె పలికించిన హావభావాలు అనే చెప్పాలి. ఆ సినిమా వల్ల రుక్మిణీకి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా ఆడలేదు. ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ డిజాస్టర్ అయ్యింది. తర్వాత వచ్చిన ‘భగీర’ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ‘ఏస్’ ‘మదరాసి’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
దీంతో రుక్మిణీ వసంత్ పై నెగిటివిటీ ఏర్పడింది. ఆమెను ఐరన్ లెగ్ అంటూ కొంతమంది విమర్శించేవరకు వెళ్ళింది పరిస్థితి. అంతేకాదు.. ఎంత క్రేజ్ ఉన్నా.. ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే సక్సెస్ అనేది చాలా అవసరం.ఆ విషయంలో రుక్మిణీ వసంత్ వెనుకబడింది. ఇలాంటి టైంలో ఆమెకు ‘కాంతార చాప్టర్ 1’ రూపంలో ఆమెకు ఓ సువర్ణావకాశం లభించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన కనకవతి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఆమె లుక్స్ కానీ, యువరాణిగా ఆమె పలికించిన హావభావాలు కానీ.. యూత్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద తొలిరోజు భారీ వసూళ్లు సాధించింది. ఇలా రుక్మిణీకి ఓ సక్సెస్ పడింది. ఆమెకు పెద్ద రిలీఫ్ దక్కినట్టే అని చెప్పాలి. ఇప్పుడు ఆమె డిమాండ్ మరింతగా పెరుగుతుంది.
సక్సెస్ దొరికింది కాబట్టి పారితోషికం పెంచినా.. దర్శకనిర్మాతలు నో చెప్పరు. ప్రస్తుతం రుక్మిణీ.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ తో పాటు యష్ ‘టాక్సిక్’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అవి కూడా హిట్ అయితే ఈమె స్టార్ డమ్ మరింతగా పెరుగుతుంది అనే చెప్పాలి.