పెళ్లి పై సల్మాన్ స్పందన!

సుల్తాన్‌తో మ‌రోసారి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నాడు స‌ల్మాన్ ఖాన్‌. ఈ సినిమా పీకే రికార్డుల‌కు కూడా ఎస‌రు పెట్డడం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. హీరోగా స‌ల్లూ భాయ్ సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. మ‌రి స‌ల్మాన్ ఖాన్ పెళ్లెప్పుడు?  ఈ ఆస‌క్తిక‌ర‌మైన అంశం మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. సానియా మీర్జా ఆత్మ‌క‌థ‌ని ఆదివారం ఆవిష్క‌రించిన స‌ల్మాన్‌కి పెళ్లెప్పుడ‌న్న ప్ర‌శ్న మ‌ళ్లీ ఎదురైంది.

”త్వ‌రలో పెళ్లి చేసుకోవ‌డం ఖాయం.. ఇంట్లోవాళ్లు కూడా బాగా తొంద‌ర‌పెడుతున్నారు” అంటూ.. పెళ్లికి సంబంధించిన హింట్ ఇచ్చేశాడు. అయితే తాను మాత్రం త‌న జీవిత క‌థ‌ని పుస్త‌కాల్లోకి ఎక్కించ‌డ‌ట‌. స్వీయ చ‌రిత్ర రాసే ఆలోచ‌న ఏమాత్రం లేద‌ట‌. ”పాత గాయాల్ని మ‌ళ్లీ గుర్తు చేసుకోవ‌డం నాకు ఇష్టం లేదు. అందుకే స్వీయ చ‌రిత్ర రాయ‌ను” అన్నాడు స‌ల్మాన్ ఖాన్‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus