Sharwanand: ఫ్రెండ్స్ సినిమా బయటకు రాబోతుంది..!

Ad not loaded.

గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు శర్వానంద్ (Sharwanand). అయినా కూడా తన టాలెంట్ మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అయితే, శర్వానంద్ మాత్రం తన పారితోషికం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇది నిర్మాతలకు కాస్త కష్టంగా ఉన్నా ఇతనితో సినిమాలు చేసేందుకు మాత్రం వెనకాడట్లేదు.ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ, ఈ రెండు సినిమాలు కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తున్నాయి.

Sharwanand

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయింది. గతేడాది అక్టోబర్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్నా, ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్‌-డేట్ లేదు. నాన్-థియేట్రికల్ రైట్స్ కోసం టీజర్, పాటలు విడుదల చేయాల్సి ఉంది. ఇక అభిలాష్ కంకర దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా కూడా మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో ఆగిపోయింది అనే ప్రచారం కూడా జరిగింది.

యూవీ వారు, శర్వా (Sharwanand) ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. వాళ్ళ సినిమా ఆగిపోవడం ఏంటి అని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పుడు శర్వానంద్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. గురువారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన శర్వానంద్, ఇండోనేషియాలోని జకార్తాకు బయలుదేరాడు. అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో బైక్ రేసర్‌గా కనిపించనున్న శర్వానంద్, ఒక కీలకమైన బైక్ రేస్ సన్నివేశంలో పాల్గొంటాడు.

ఇది శర్వానంద్ కెరీర్‌లోనే తొలి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ సినిమా. ఇందులో ఈ హీరో పాత్ర గత సినిమాల కంటే చాలా భిన్నంగా ఉండబోతోందని సమాచారం.’#Sharwa36′ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. విక్రమ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ తర్వాత విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి శర్వానంద్ సినిమాకి మోక్షం దక్కినట్టే అనుకోవాలి.

 సుకుమార్ కొత్త అవతారం.. ఎన్నాళ్ళు ఇలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus