Sukumar: సుకుమార్ కొత్త అవతారం.. ఎన్నాళ్ళు ఇలా?

Ad not loaded.

5 ఏళ్ల తర్వాత డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఫ్రీ అయ్యాడు. ‘పుష్ప 3’ అనౌన్స్ చేసినా ఇప్పట్లో అది కష్టం. రామ్ చరణ్ తో (Ram Charan) సినిమా ఉంది కానీ అది ఇప్పట్లో కాదు. అందుకే ఈ గ్యాప్ ని నిర్మాతగా ఫిల్ చేయాలి అనుకుంటున్నాడు. ‘మైత్రి’ లో ఆల్రెడీ కొన్ని సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క వేరే బ్యానర్స్ తో కూడా టై అప్ అయ్యి తన శిష్యుల సినిమాలని సహా నిర్మాతగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

Sukumar

స్క్రీన్ ప్లే అందించడం తప్ప అతను పెట్టే పెట్టుబడి అంటూ ఏమీ ఉండదు.దానికి లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడు. దిల్ రాజు (Dil Raju) వారసుడు ఆశిష్ రెడ్డి (Ashish Reddy) హీరోగా ‘సెల్ఫిష్’ (Selfish) అనే సినిమాను సుకుమార్ కో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దిల్ రాజు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.కానీ స్క్రిప్ట్ బాలేదని మధ్యలో ఆపేశారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ అయిపోయింది. కానీ రషెస్ చూశాక బాగా రాలేదని ఆపేశారు.

ఇప్పుడు సుకుమార్ స్క్రిప్ట్ ని మళ్లీ సరి చేస్తున్నాడు. అది అయిపోగానే షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేస్తారు. ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ పై మరో రెండు సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. అవి స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ సంవత్సరమే సెట్స్ మీదకు వెళ్తాయి. అంతేకాదు, కొత్త కథలు కూడా వింటున్నాడట సుకుమార్. తన టీమ్ కొన్ని కథలు ఫైనల్ చేసి సుకుమార్ కి వినిపించారట.

ఇకపోతే దిల్ రాజు, సుకుమార్ కలిసి మళ్లీ 18 ఏళ్ల తర్వాత పనిచేస్తున్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి ‘ఆర్య’ (Aarya) సినిమా చేశారు, అది సుకుమార్ కి డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ. మొత్తానికి రామ్ చరణ్ సినిమా స్టార్ట్ చేసేలోపు సుకుమార్ నిర్మాతగా మాత్రం చాలా బిజీగా ఉండబోతున్నాడు. ఒకేసారి చాలా ప్రాజెక్టులు పట్టాలెక్కించబోతున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus