‘వెంకీమామ’ ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని.. దగ్గుబాటి,అక్కినేని అభిమానులే కాదు.. మిగిలిన హీరోల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం నిజజీవితంలో మామా అల్లుళ్ళు అయిన నాగచైతన్య, వెంకటేష్ లు కలిసి నటిస్తుండడమే..! ఈఏడాది ఇప్పటికే.. వీళ్ళిద్దరూ బ్లాక్ బస్టర్లు కొట్టి మంచి ఫామ్లో ఉన్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు.
మొదట ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి పెద్ద సినిమా ఉండడంతో పోస్ట్ పోన్ అయ్యిందిలే అని అంతా అనుకున్నారు. తరువాత దీపావళి అన్నారు, క్రిస్మస్, సంక్రాంతి అని కూడా అన్నారు. దీంతో కన్ఫ్యూజన్ మొదలైంది. 2020 రిపబ్లిక్ డే కి రిలీజ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ పై వచ్చే వార్తలకి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఈ చిత్రాన్ని 30 కోట్లతో తెరకెక్కించాలనుకున్న నిర్మాతలకి ఏకంగా 45 కోట్లు ఖర్చు అయ్యిందట. దీంతో సోలో రిలీజ్ కావలి. అందుకే కన్ఫ్యూజన్లో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. చివరికి ఈ చిత్రాన్ని డిసెంబర్ 13 న విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారనిది చిత్ర యూనిట్ సభ్యుల నుండీ అందుతున్న సమాచారం. డిసెంబర్ 20 నుండీ చాలా సినిమాలు ఉన్నాయి. దీంతో డిసెంబర్ 13 న విడుదల చేస్తే మొదటి వారం బాగా క్యాష్ చేసుకోవచ్చని భావించి ఆ డేట్ ను లాక్ చేసారని తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది. డిసెంబర్ 13 న వెంకటేష్ పుట్టినరోజు కావడంతో అభిమానులకి పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టే..!