ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ నుంచి ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే పాట విడుదల

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ నుంచి ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే పాట విడుదల

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ తెర‌కెక్కించినట్టుగా ఆ మధ్య విడుదలైన టీజర్‌ను చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే ఈ పాటను చిత్రయూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాటను వనమాలి రచించగా.. నూతన మోహన్, కృష్ణ తేజస్వీ, రితేజ్ జి రావు సంయుక్తంగా ఆలపించారు. మిక్కీ జే మేయర్ అందించిన బాణీ సుతిమెత్తగా అందరినీ గుండెల్ని తాకేలా ఉంది. ఇక బృందా మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ లిరికల్ వీడియో ఎంతో చూడముచ్చటగా మారింది. పెళ్లి సంబరాల్లో ఈ పాటను ప్లే చేసేలా మేకర్లు తెరకెక్కించారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

న‌టీన‌టులు : లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహ‌న్‌, వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ‌: ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌
బ్యాన‌ర్స్‌: దుర్గాదేవి పిక్చ‌ర్స్
నిర్మాత‌: నాగ మోహ‌న్
ద‌ర్శ‌క‌త్వం: తాతినేని స‌త్య‌
సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: బినేంద్ర మీన‌న్‌
మాట‌లు: ఉద‌య్ పొట్టిపాడు
ఆర్ట్‌: కోసనం విఠల్
ఎడిట‌ర్‌: స‌తీష్ సూర్య‌
పి.ఆర్.ఒ: మోహ‌న్ తుమ్మ‌ల‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus