దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి నాలుగేళ్లు శ్రమించి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ మూవీ శుక్రవారం విడుదలై కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతకంటే అభినందనలు అందుకుంటోంది. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల వారు బాహుబలి చిత్రాన్ని ప్రసంశిస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ వినూత్నంగా తప్పులు ఎత్తిచూపారు.
1. భారీ బడ్జెట్ తో నిర్మించిన మూవీని కేవలం 120 రూపాయలకే చూపించడం మొదటి తప్పు. ఇందుకోసం థియేటర్లవద్ద కలెక్షన్ బాక్స్ ఏర్పాటు చేస్తే ఎంత బాగా నచ్చిందో అంత డబ్బులు అందులో వేసేలా చర్యలు తీసుకోవాలి.
2. సినిమా నిడివి చాలా తక్కువగా వుంది. కేవలం 2 .50 గంటల్లో సినిమా పూర్తయిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే అయిపోయిందని ప్రేక్షకులు చాలా బాధపడుతున్నారు.
3. సినిమాలో రాజమౌళి ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరించారు. టూమచ్ డిటెయిలింగ్ అండ్ పెర్‌ఫెక్షన్ తో, చాలామంది ఫిలిం మేకర్స్ తమ నమ్మకాన్ని, పొగరుని తగ్గించుకునే ప్రమాదంలో పడ్డారు.
4. మహిష్మతి రాజ్యానికి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కంక్లూజన్ అవడానికి వీల్లేదు. ఈ కోవలోనే, మరో పది సినిమాల్ని తెరకెక్కించాలి.
5. రాబోయే దర్శకులకు భారీ లక్ష్యాన్ని రాజమౌళి ముందు ఉంచారు. బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టాలంటే భారతీయ సినీ పరిశ్రమలో చాలా ఏళ్ళు పడుతుంది. ఇలా జక్కన్న పెద్ద తప్పు చేశారు.
ఇవన్నీ తప్పులుగా అనిపించడం లేదు కదూ.. ఇవి మిస్టేక్స్ కాదు ప్రశంసలు. తమిళ దర్శకుడు తన అభినందనలను ఇలా క్రియేటివ్ గా చెప్పి ఆకట్టుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.