యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంతల పెళ్లికి మరో అడ్డు తొలిగి పోయింది. వీరి ప్రేమకు ఇరుకుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పెళ్లి విషయంలో అడుగులు ముందుకు పడలేదు. దీనికి కారణం ఏమిటని అన్వేషిస్తే ఆసక్తికర విషయం బయట పడింది. పెళ్లి తమ సంప్రదాయం ప్రకారం చర్చిలో జరగాలని చైతూని సమంత కోరిందంట. ప్రియురాలి కోరికకు చైతూ ఎస్ అన్నా, కుటుంసభ్యులు ఏమంటారోనని చెప్పడానికి సంశయించడాని తెలిసింది. ఆ పని కూడా సమంతనే భుజాన వేసుకొని అత్తయ్య అమలకు తన మనసులోని మాటను చెప్పిందంట.
అందుకు ఆమె సానుకూలంగా స్పందించి పెళ్లి తమిళనాడులో జరిపించేందుకు అంగీకరించిందని తాజా సమాచారం. నాగార్జున కూడా ఇందుకు ఒకే చెప్పారని తెలిసింది. అయితే రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లోనే జరగనుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో చెన్నై లోని చర్చ్ లో చైతు, సమంత వివాహ వేడుక నిర్వహించనున్నారు. తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.