Trail Period: ఈ వెబ్ సిరీస్ ని ఓకే చేయటానికి నాకు ఎంతో టైం పట్టలేదు: స్టార్ హీరోయిన్

తెలుగులో బొమ్మ‌రిల్లు, ఢీ, రెడీతో పాటు ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది జెనీలియా. కెరీర్ స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న త‌రుణంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లిచేసుకొని సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసింది. దాదాపు ఆరేళ్ల విరామం త‌ర్వాత గ‌త ఏడాది సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా భ‌ర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో క‌లిసి మిస్ట‌ర్ మ‌మ్మీ, వేడ్ అనే సినిమాలు సినిమాలు చేసింది. తాజాగా జెనీలియా ఓటీటీలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. ట్ర‌య‌ల్ పీరియ‌డ్ పేరుతో ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.

జూలై 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జెనీలియా మీడియాతో మాట్లాడింది. ఈ సిరీస్‌ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలిపింది. ట్రయల్‌ పీరియడ్‌ కథ విన్న వెంటనే ఓకే చేశాను. నేను రీఎంట్రీ ఇవ్వాలని అనుకునే సమయంలో ఈ స్క్రిప్ట్‌ నా దగ్గరకు వచ్చింది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్‌ను అంగీకరించేందుకు స్క్రిప్ట్‌ చదవడం కోసం ఎక్కువ సమయం తీసుకుంటాను. కానీ, ఈ వెబ్‌సిరీస్‌ కథను గంటలో చదివేసి ఓకే చేశాను.

నాకు ఈ కథ అంత ఆసక్తిగా అనిపించింది. ఓటీటీలో కుటుంబమంతా కలిసి చూసే కథలు తగ్గిపోయాయని నా అభిప్రాయం. పిల్లలతో కలిసి మేం చాలా సినిమాలు చూడలేకపోతున్నాం. అందుకే ‘ట్రయల్‌ పీరియడ్‌’ కథను ఎంచుకున్నాం. ఈ సిరీస్‌ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఇటీవల విడుదలైన ‘వేద్‌’ సినిమా కూడా కుటుంబకథా చిత్రమే’’ అని జెనీలియా చెప్పింది. తండ్రి గురించి అన్వేషించే ఓ యువ‌తి క‌థ‌తో ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామాగా ట్ర‌య‌ల్ పీరియ‌డ్‌ సిరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

ఈ ట్ర‌య‌ల్ పీరియ‌డ్ (Trail Period) సిరీస్‌కు అలేయా సేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. జెనీలియా న‌టిస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది. దాదాపు ప‌ద‌కొండేళ్ల విరామం త‌ర్వాత జెనీలియా తెలుగులో జూనియ‌ర్ అనే సినిమాలో న‌టిస్తోంది. గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు కిరీటి ఈ మూవీతో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోన్న జూనియ‌ర్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నాడు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus