నలుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రారంభం!
- January 22, 2019 / 07:48 AM ISTByFilmy Focus
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హిమ బిందు వెలగపూడి నిర్మాణంలో బాలు దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ఈ సందర్భంగా …
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దర్శకుడు బాలు మాట్లాడుతూ – “ మహానగరంలో నివసిస్తూ స్వతంత్య్ర భావాలున్న నలుగురు అమ్మాయిలకు సంబంధించిన కథే ఈ చిత్రం. త్రిదా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధి ఇద్నాని, కొమలి ప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి“ అన్నారు.
నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ – “హైదరాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఫిబ్రవరిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.











