నలుగురు యువ హీరోలు కలసి ఓ ఫొటో దిగితే ఎంత ఆసక్తికరంగా ఉంటుందో… అలాగే నలుగురు దర్శకులు దిగిన ఫొటో కూడా అంతే ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అందుకే ఛార్మి షేర్ చేసిన లేటెస్ట్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబయిలో తీసిన ఈ ఫొటోలో ఇండస్ట్రీలో భారీ సినిమాలు తీస్తున్న ముగ్గురు దర్శకులు, మరో యువ దర్శకుడు ఉన్నారు. పని మీద ముంబయి వెళ్లిన ఆ దర్శకులకు పూరి పార్టీ ఇచ్చారు అని అంటున్నారు.
‘లైగర్’ ప్రాజెక్టు కోసం పూరి జగన్నాథ్ చాలా రోజుల నుండి ముంబయిలోనే ఉంటున్నారు. సినిమా షూటింగ్ సంగతేమో కానీ, అక్కడికి వెళ్లిన సహ దర్శకులు, స్నేహితులకు హోస్టింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు క్రిష్ ముంబయి వెళ్లారు. ‘హరి హర వీరమల్లు’ పనుల కోసం క్రిష్ అక్కడికి వెళ్లారట. అదే సమయంలో ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్‌ఫాదర్’ తీస్తున్న మోహన్‌రాజా కూడా కాస్టింగ్ పని మీద ముంబయి వెళ్లారు.
అనుష్కతో ‘నిశ్శబ్దం’ సినిమా తీసిన హేమంత్ మధుకర్ ప్రస్తుతం పూరితోనే ఉంటున్నారు. ఈ క్రమంలో క్రిష్, మోహన్‌రాజాకు పూరి పార్టీ హోస్ట్ చేశారు అని సమాచారం. ఈ నేపథ్యంలో తీసిన ఫొటోను పూరి స్నేహితురాలు ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు.