హీరోగా శర్వానంద్ కి మంచి హిట్స్ ఉన్నప్పటికీ.. మరీ 25 కోట్లకు మించిన కలెక్షన్స్ సాధించే స్థాయిలో మాత్రం ఇప్పటివరకూ శర్వా హిట్ కొట్టలేదు. కానీ.. ఆయన కథానాయకుడిగా నటించిన “పడి పడి లేచే మనసు” ఏకంగా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందట. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మునుపటి చిత్రం “లై” డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ పాయింట్ సాయిపల్లవి మాత్రమే. అలాగే.. ధనుష్ హీరోగా తమిళంలో రూపొందిన “మారి 2” చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సాయిపల్లవి మాత్రమే, ఎందుకంటే “మారి” మునుపటి చిత్రానికి కానీ.. ధనుష్ కి కానీ తెలుగులో పెద్దగా విజయాలు లేవు.
దాంతో.. శర్వా, ధనుష్ లు సాయిపల్లవి మీదే తన పూర్తి నమ్మకాన్ని పెట్టుకొన్నారు. ఇదివరకూ నాని, వరుణ్ తేజ్ లకు కూడా సాయిపల్లవి ఫ్యాక్టర్ చాలా ప్లస్ అయ్యింది. మరి వాళ్ళకు లాగే శర్వా, ధనుష్ లకు కూడా సాయిపల్లవి ఫ్యాక్టర్ పనికొస్తుందేమో చూడాలి. మరి ఈ రెండు సినిమాల రిజల్ట్స్ ఏమిటనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.