Actor Naresh: నాలుగో పెళ్లికి రెడీ అయిన నరేశ్‌.. ఇంతకుముందు ఏం జరిగిందంటే?

నరేశ్‌ – పవిత్ర.. వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది? అంటూ ఇన్నాళ్లూ టాలీవుడ్‌ వర్గాల్లో, సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏం లేదు, ఏం లేదు అంటూ కొన్ని రోజులుగా దాటేస్తూ వచ్చిన నరేశ్‌.. ఇటీవల మాధ్య మీరు అనుకుంటున్నదే ఉంది అంటూ టీజర్‌ వీడియోతో క్లారిటీ ఇచ్చేశారు. కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా వీడియో రిలీజ్‌ చేస్తూ.. ‘తాము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ భారీ షాక్ ఇచ్చారు నరేష్ – పవిత్ర. అయితే నరేశ్‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఆ వివరాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

పవిత్ర లోకేష్‌ను నరేష్ వివాహం చేసుకున్నారు అంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే అవి ఆ తర్వాత పుకార్లుగా మిగిలిపోయాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయంలో నరేష్ – పవిత్ర జంటగా పూజలు నిర్వహించారని అన్నారు. వివాహం చేసుకున్న ఈ జంట దైవదర్శనం కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే అప్పుడు పెళ్లి వార్తలను నరేష్ ఖండించారు. పవిత్ర లోకేశ్‌తో సహజీవనం చేస్తున్నానని తెలియజేశారు. వివాహ వ్యవస్థపై తమకు నమ్మకం లేదన్న నరేష్, ప్రస్తుతానికి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకునే ఆలోచన లేదన్నారు.

కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అని ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు ఇంతకుముందు నరేశ్‌కు మూడు సార్లు పెళ్లి అయ్యింది. 17 ఏళ్లకే హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టారు నరేశ్‌. అక్కడికి రెండేళ్లకే అంటే అతని 19 ఏళ్ల వయసులో పెద్దలు పెళ్లి చేశారు. సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఆ వయసులో మెచ్యూరిటీ లేకపోవడం, మొదటి భార్యకు అనారోగ్యంగా ఉండటంతో విడిపోయారు. వీరికి ఒక అబ్బాయి. అతనే పేరు నవీన్ విజయ కృష్ణ. ఎడిటర్, హీరోగా ప్రేక్షకులకు పరిచయమే.

ఆ తర్వాత రెండో వివాహంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. అతడు పెయింటింగ్ ఆర్టిస్ట్ అని నరేష్ వెల్లడించారు. కానీ ఆమెతో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. మూడో భార్య రమ్య రఘుపతితో కూడా విభేదాల కారణంగానే విడిపోయారు. ఈమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడు కూతురు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రమ్య రఘుపతితో నరేష్ విడిపోయారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus