బ్లఫ్ మాస్టర్’ కు పాజిటివ్ బజ్..!

ఓ వైపు హీరోగా మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ తన కంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు సత్యదేవ్. ‘జ్యోతి లక్ష్మీ’ ‘ఘాజీ’ ‘క్షణం’ వంటి విభిన్న కథలు ఎంచుకుంటూ టేస్ట్ ఉన్న హీరోగా ముందుకు సాగుతున్నాడు సత్యదేవ్. తాజాగా సత్యదేవ్ హీరోగా నందిత శ్వేతా హెరాయిన్ గా నటించిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. ‘చతురంగ వేట్టై’ తమిళ చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, అలాగే సునీల్ కశ్యప్ అందించిన ఆడియోకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ‘శ్రీదేవి మూవీస్ సంస్థ’ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు కాగా ‘అభిషేక్ ఫిలిమ్స్’ అధినేత ర‌మేష్ పిళ్లై నిర్మాతగా వ్యవహరించారు.గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 28 న విడుదల కాబోతోంది.

తాజాగా ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్ల కోసం స్పెషల్ షో వేశారు. సినిమా నచ్చడంతో దాదాపు పెద్ద నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూటర్ సంస్దలు ఈ చిత్రాన్ని దక్కించుకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సీడెడ్,గుంటూరు కు గాను సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ , నైజాం, వైజాగ్ కు దిల్ రాజుక, కృష్ణ, ఈస్ట్, వెస్ట్ కు జీ 3 సంస్థ , ఏసియన్ సునీల్ సారథ్యంలోని కేఎఫ్సీకి కర్ణాటక అలాగే నిర్వాణ సినిమాస్ కు ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్నారు. సెన్సార్ టాక్ కూడా ఫుల్ పాజిటివ్ గా రావడంతో మంచి రేట్లకే ‘బ్లఫ్ మాస్టర్’ కొనుగోలు చేసినట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఇవన్నీ చూస్తుంటే ‘బ్లఫ్ మాస్టర్’ ఘనవిజయం సాధించడం ఖాయమనిపిస్తుంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్ విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus