Revanth: పప్పు అంటూ ఆడుకున్న నాగార్జున..! అసలు మేటర్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాగార్జున ఎపిసోడ్ తుస్ తుస్ మంటూనే సాగింది. ఏదో కొన్ని హౌస్ మేట్స్ కి సెటైర్స్ వేస్తూ లాగించేశాడు హౌస్ట్ నాగార్జున. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ టాస్క్ లో పోస్టర్స్ అంటించేటపుడు రేవంత్ నువ్వు ఆగరా పప్పు అంటూ అర్జున్ ని అన్నాడు. దాంతో వాళ్లిద్దరికీ ఆర్గ్యూమెంట్ అయ్యింది. అప్పటికప్పుడు అర్జున్ సైలెంట్ గా ఉన్నా, ఆ తర్వాత శ్రీసత్య రెచ్చగొట్టేసరికి రేవంత్ పై రెచ్చిపోయాడు. ఇది హోస్ట్ నాగార్జున క్లియర్ గా శ్రీసత్యని, అర్జున్ ని అడిగాడు. అర్జున్ ని కార్నర్ చేశారు.

కేవలం శ్రీసత్య చెప్పిన తర్వాతే ఇలా చేశావా అంటూ నిలదీశాడు. దానికి అర్జున్ కవర్ కోటింగ్ చేశాడు కానీ, పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అలాగే, శ్రీసత్యని కూడా అర్జున్ ని ఉసిగొల్పావా అంటూ మాట్లాడాడు కింగ్ నాగార్జున. ఇక ఎపిసోడ్ అంతా కూడా రేవంత్ ని పప్పు , పప్పు అంటూ ఫుల్ రోస్ట్ చేశారు. అసలు టాస్క్ లో ఏంజరిగిందంటే., పోస్టర్స్ అంటించేటపుడు అర్జున్ కళ్యాణ్ ని రేవంత్ నువ్వు ఆగరా పప్పు అంటూ మాట్లాడాడు. ఫ్రెండ్షిప్ మీద అర్జున్ అప్పటికప్పుడు నోరు అదుపులో పెట్టుకో అని చెప్పినా ఆ తర్వాత శ్రీసత్య అర్జున్ ని రెచ్చగొట్టింది.

అస్సలు నువ్వు ఏదీ పట్టించుకోవా ? నీకు రియాక్షన్స్ ఉండవా అంటూ ఏద్దేవా చేసింది. దీంతో అర్జున్ రేవంత్ పై గొడవకి వెళ్లాడు. రేవంత్ కూడా పక్కనోళ్లు చెప్పేసరికి కాదురా, నీకు ఉండాలి అంటూ మాట్లాడాడు. అంతేకాదు, అర్జున్ – రేవంత్ అప్పట్నుంచీ ఒకరికొకరు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో వీకండ్ నాగార్జున ఈ ఇష్యూని అడ్రస్ చేశాడు. రేవంత్ ని ఫస్ట్ నుంచీ పప్పు పప్పు అంటూ మాట్లాడుతునే ఉన్నారు. దీంతో రేవంత్ కి ఆన్సర్ లేకుండా పోయంది.

నాగార్జున రేవంత్ కి సూటిగా సలహా ఇచ్చారు. గేమ్ బాగా ఆడుతున్నావ్ కానీ, ఫ్రెండ్షిప్ లో అయినా, ఎక్కడైనా కూడా పేర్లు పెట్టడం, అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పాడు. అంతేకాదు, పకోడి అనడం, పుణుగులు, పూరీలు అని పేర్లు పెట్టి పిలవడం ఫ్రెండ్షిప్ వరకూ ఓకే కానీ, వేరేవాళ్లు పక్కకెళ్లి హర్ట్ అవుతారని చాలా క్లియర్ గా చెప్పాడు. రేవంత్ అర్జున్ కళ్యాణ్ కి సారీ చెప్పాడు. వీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ అందర్నీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హౌస్ లో ఉండే అర్హత ఎవరికి ఉంది, అనర్హత ఎవరికి ఉంది అనే పాయింట్స్ ని చెప్పించాడు.

దీంతో మెజారిటీ ఓట్లు మెరీనాకి పడ్డాయి మెరీనా అన్ డిసర్వ్ అని, శ్రీహాన్ డిసర్వ్ అని ఓటింగ్ వేశారు హౌస్ మేట్స్. ఇక ఆదివారం దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ తో స్టేజ్ దద్దరిల్లబోతోంది. ఈ ఎపిసోడ్ లో సెలబ్రిటీల డ్యాన్స్ లు, హైపర్ ఆది పంచ్ లు, అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ ఉండబోతోంది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus