సంక్రాంతి అల్లుళ్ళ కామెడీ అదిరిందట!

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంతో తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు చాన్నాళ్ల తర్వాత శ్రీకారం చుట్టిన వెంకటేష్ ఆ తర్వాత “మసాలా, గోపాల గోపాల” సినిమాలతో ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు అదే తారాహాలో నటించిన చిత్రం “ఎఫ్ 2”. ఈసారి యువ కథానాయకుడు వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు వెంకీ. “పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకొన్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని “యు/ఎ” సర్టిఫికేట్ అందుకొంది.

విడుదల చేసిన టీజర్ మరియు సాంగ్ ప్రోమోస్ తోనే ‘ఎఫ్ 2″ కామెడీ సినిమా అని స్పష్టమవ్వగా.. పెళ్ళైన మగవారి కష్టాల నేపధ్యంలో సినిమా మొత్తం చాలా కామెడీగా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే.. సినిమాలో వెంకీ పెళ్లి కష్టాలు చూపిస్తే.. వరుణ్ మాత్రం నవతరం ప్రేమికుల బాధలను ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా ఉన్నప్పటికీ.. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్ గా ఉండబోతోందట. సో, లాజిక్స్ ఎక్స్ పెక్ట్ చేయకుండా కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం థియేటర్ కి వెళ్తే మాత్రం థియేటర్లో ప్రేక్షకులు అనిల్ రావిపూడి మునుపటి సినిమాలు ఎంజాయ్ చేసినట్లుగానే ఎంజాయ్ చేస్తారట. సో.. అంతరిక్షంతో కాస్త ఢీలాపడిన వరుణ్ ఎఫ్ 2తో హిట్ కొట్టినట్లేనన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus