Gaalivaana Web Series Review : గాలివాన వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • April 15, 2022 / 08:36 PM IST

సాయికుమార్, రాధిక శరత్ కుమార్ వంటి సీనియర్ క్యాస్టింగ్ తో తెలుగులో తెరకెక్కిన వెబ్ సిరీస్ “గాలివాన”. ప్రఖ్యాత బీబీసి ఛానల్ కు చెందిన ఓ డాక్యుమెంటరీకి చిత్రరూపంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జీ5 యాప్ లో విడుదలైంది. టీజర్ & ట్రైలర్ మంచి ఉత్కంఠను రేపగా.. క్యాస్టింగ్ సిరీస్ మీద మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. మరి ఈ 7 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పట్నుంచే ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు అజయ్-గీత. హనీమూన్ కోసం వైజాగ్ వెళ్ళిన ఈ నవ జంటను ఓ దొంగ కిరాతకంగా హత్య చేసి అక్కడి నగాలతో పారిపోతాడు. అదే దొంగ అజయ్-గీత కుటుంబాల వద్దకు అనుకోని విధంగా ఓ యాక్సిడెంట్ కారణంగా చేరుకుంటాడు. కొన ప్రాణాలతో ఉన్న అతడ్ని కాపాడి పోలీసులకు అప్పజెబుదాం అనుకున్నప్పటికీ.. రెండు కుటుంబాల్లోని ఒకరు అతడ్ని చంపేస్తారు.

అసలు అజయ్-గీతలను హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ దొంగ ఈ కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతానికే ఎందుకు వచ్చాడు? ఈ కేస్ ను పోలీస్ ఇన్స్పెక్టర్ నందిని (నందిని రాయ్) ఎలా డీల్ చేసింది? అనేది “గాలివాన” కథాంశం.

నటీనటు పనితీరు: సాయికుమార్ తన పెర్ఫార్మెన్స్ తో ఈ వెబ్ సిరీస్ కు మెయిన్ పిల్లర్ లా నిలిచాడు. ఓ తల్లిగా, భార్యగా దారుణమైన మనోవేదనకు గురయ్యే పాత్రలో రాధిక శరత్ కుమార్ జీవించేశారు. చాందిని చౌదరి, చైతన్యకృష్ణ, నందినీరాయ్ లు తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. అందరికంటే ఎక్కువ హైలైట్ అయ్యింది మాత్రం తాగుబోతు రమేష్. సపోర్టింగ్ రోల్లో అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి ఒక కాంప్లెక్స్ స్టోరీని థ్రిల్లర్ గా మలిచి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అలాగే క్లైమాక్స్ ను డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా క్యారెక్టర్స్ ను ఎలివేట్ చేస్తూ.. కథను ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. 7 ఎపిసోడ్లతో కథను మరీ ఎక్కువగా సాగదీయకుండా సిరీస్ ను ఆసక్తికరంగా మలిచాడు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి చాలా ఇబ్బందిపడే కాన్సెప్ట్ ను మరీ ఎక్కువగా ఇబ్బందిపెట్టకుండా, చిన్నపాటి లాజికల్ థియేరీతో.. ఆడియన్స్ ను కాన్సెప్ట్ లో ఇన్వాల్వ్ చేసి థ్రిల్ చేశాడు.

సుజాత సిద్ధార్ధ్ కెమెరా వర్మ్ & లైటింగ్ బాగుంది. గౌర హరి నేపధ్య సంగీతం కూడా సిరీస్ లోని ఎమోషన్స్ ను బాగానే ఎలివేట్ చేసింది. స్క్రీన్ ప్లే విషయంలో తీసుకున్న జాగ్రత్తలకు సదరు రైటర్స్ ను మెచ్చుకోవాలి. జీ5 టీం & నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ టీం ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది.

విశ్లేషణ: ఒక షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చే ఫ్యామిలీ థ్రిల్లర్ “గాలివాన”. కథలోని ముఖ్యమైన ట్విస్ట్ ను మాత్రం ఎవరూ ఊహించలేరు. ఆ ట్విస్ట్ యొక్క టెంపోను ను మైంటైన్ ఒక చక్కని థ్రిల్లర్ గా 7 ఎపిసోడ్ల సిరీస్ ను క్యారీ చేసిన విధానం కోసం “గాలివాన”ను జీ5 యాప్ లో కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus